సిఎం పోస్ట్ కోసం కెసిఆర్ డిమాండ్: విష ప్రచారం... వినోద్

Vinod Kumar
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి కోసం తమ పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికార కాంగ్రెసు పార్టీని డిమాండ్ చేశారనే వార్తల పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా స్పందించింది. పార్టీ మాజీ ఎంపీ, పొలిట్ బ్యూరో సభ్యుడు వినోద్ కుమార్ గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు బదులుగా కెసిఆర్ తనకు సిఎం పదవి, తన కుటుంబానికి ఉన్నత పదవులు కోరారనే వార్తలు శుద్ధ అబద్దం అన్నారు.

ఢిల్లీ పర్యటనల పైన కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ తీవ్రతను తగ్గించేందుకే కెసిఆర్‌ను సీమాంధ్ర మీడియా, కొన్ని పార్టీలు వ్యక్తిగతంగా లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి పదవి అడగడం వల్లనే కాంగ్రెసు తెలంగాణ ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గిందనే ప్రచారానికి తెరలేపారన్నారు. కెసిఆర్ పదవులు కోరుకునే వ్యక్తి కాదన్నారు.

తెలంగాణ ఇచ్చే యూపిఏ-1 ప్రభుత్వం పడిపోవద్దని కెసిఆర్ గతంలో షిప్పింగ్ మంత్రి పదవిని వదిలేసుకున్నారని చెప్పారు. ఆ పదవిని గంటల్లోనే ఆయన వదిలేసుకున్నప్పటికీ మీడియాలో మాత్రం కెసిఆర్‌కు ఓడలు ఉన్నాయని, ఆయన వ్యాపారం చేస్తున్నారనే ప్రచారం జరిగిందన్నారు. గతంలో కెసిఆర్‌ను కాంగ్రెసు పెద్దలు ఢిల్లీకి పిలవలేదని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్ చేశారని రాస్తున్నారన్నారు.

షిప్పింగ్ మంత్రి పదవి వదులుకున్న తర్వాత సంవత్సరం వరకు కెసిఆర్‌కు ఏ శాఖ కేటాయించలేదన్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనకు శాఖ కేటాయించలేదన్నారు. ఆ తర్వాత బిజెపి నేత లాల్ కృష్ణ అద్వానీ విమర్శిస్తే లేబర్ మంత్రిత్వ శాఖ ఇచ్చారని దానికీ, కెసిఆర్ అర్రులు చాచలేదన్నారు. మీడియా కాబట్టి మర్యాద ఇస్తున్నామని కానీ, రాసేముందు దీనిపై తమను అడగాల్సిన బాధ్యత రాసేవారిపై ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+