తెలంగాణకు పవార్ మద్దతు: వస్తుందన్న శంకరరావు

పార్టీని ఇబ్బంది పెట్టొద్దు
పార్టీ అధిష్టానాన్ని ఇబ్బందులు పెట్టవద్దని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు గురువారం సూచించారు. ఆయన ఈ రోజు హైదరాబాదులో మాట్లాడారు. ఫిబ్రవరి నెలాఖరులోగా తెలంగాణ ఏర్పాటు ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరవై రోజుల్లో తెలంగాణపై కేంద్రం నుండి ప్రకటన వస్తుందని ఆయన అన్నారు.
ఆ ప్రకటన తెలంగాణకు అనుకూలంగానే ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే తాను రాజకీయాల నుండి వైదొలగుతానని చెప్పారు. ఎంపీలు రాజీనామాలపై పునరాలోచన చేయాలని సూచించారు. పరిష్కారం కోసం ఆలోచిస్తున్న సమయంలో అధిష్టానానికి ఇబ్బందులు తీసుకు రావొద్దన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో పాటు ముఖ్యమంత్రి మార్పు కూడా జరుగుతుందని, తెలంగాణ నేతకు సిఎం పదవి దక్కుతుందని జోస్యం చెప్పారు.
షిండే సానుకూలంగా స్పందించారు
తెలంగాణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు.
లగడపాటిపై చర్యలు తీసుకోవాలి
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పైన చర్యలు తీసుకోవాలని తెరాస నేత శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇరు ప్రాంత ప్రజలను తమ మాటలతో ఆయన రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. 90 శాతం మంది సమైక్యాన్ని కోరుకుంటున్నారన్న లగడపాటి తెలంగాణలో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. లగడపాటి విచ్ఛిన్నకర శక్తిగా మారారాని, హైదరాబాదు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.
బొత్సపై సోనియాకు లేఖ
పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీశారంటు పిసిసి ఉపాధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications