అఫైర్‌పై భర్తతో గొడవ: ఇద్దరు కూతుళ్లను చంపిన తల్లి

పిల్లలను చంపిన తల్లి కె. సుజాత (28)ను పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. ఆమె భర్త రవి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సుజాత ఇంట్లోనే ఉంటుంది. తన ఇద్దరు పిల్లలను తన భర్త రవి చంపాడని సుజాత మొదట పోలీసులకు చెప్పింది. అయితే, తానే సుచరిత, స్రవంతిలను గ్రామ శివారులోని బావిలో పడేశానని ఆ తర్వాత అంగీకరించింది.
తన భర్త రవి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని ఆగ్రహించిన మహిళ ఆ దురాగతానికి పాల్పడింది. భర్తతో ఆమె రాత్రిపూట గొడవ పడింది. ఆ కోపంలో పిల్లలతో బయటకు వెళ్లిపోయి వారిని బావిలో పడేసింది.
స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. భర్తపై కోపంతో తీవ్ర చర్యకు దిగిన మహిళ ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సి వస్తోంది.












Click it and Unblock the Notifications