బిజెపిలో నేనూ ప్రధాని అభ్యర్థినే: వెంకయ్య నాయుడు

పానాజీలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. యుపిఎ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదని, యువ నేతలను తెరపైకి తీసుకొచ్చినా ఆ పార్టీని ఎవ్వరూ కాపాడలేరని అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండంకెల సంఖ్యకు పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ తమను మోసగించిందని ప్రజలు భావిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నో కుంభకోణాలతో సతమతమవుతోందని, ముందస్తుకు వెళ్లినా వెళ్లవచ్చని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ముందుగా తమ దేశంలోని సంక్షోభం గురించి చూసుకోవాలని, షారుక్ గురించి రెహ్మాన్ మాలిక్‌కు ఎందుకని ఎద్దేవా చేశారు.
పార్టీ నేతలు ప్రసంగాలు చేసే సమయంలో సంయమనం పాటించాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఉద్బోధించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. శాంతి, సహనం అవసరమని హితవు పలికారు.
ఇదిలావుంటే, నితిన్ గడ్కరీ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టకుండా పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు చేతులు కలిపి మరీ కుట్ర చేశారని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య ఆరోపించారు. గడ్కరీకి వ్యతిరేకంగా మీడియాకు సమాచారం కూడా వారే అందించారని చెప్పారు.












Click it and Unblock the Notifications