కిరణ్‌కు మెజార్టీ ఉందా?: అంబటి, బొత్సకు పేర్నిథ్యాంక్స్

తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తామని చెప్పిన బొత్స సత్యనారాయణ వారి పేర్లు చెప్పే స్థితిలో లేరని విమర్శించారు. వారిపై వేటు వేస్తే కాంగ్రెసు పార్టీ మెజార్టీ శాసనసభలో ఎంతుంటుందని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిలబడుతుందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను బహిష్కరిస్తే అసెంబ్లీలో కాంగ్రెసు ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని అంబటి చెప్పారు.
ప్రభుత్వానికి, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన మజ్లిస్ పార్టీ నేతలు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీలు, మాజీ మంత్రి శంకర రావుల పైన కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అక్బర్, శంకర రావుల అరెస్టు వారి కుట్రలో భాగమే అన్నారు.
సహకార ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అరవై శాతం గెలుచుకుందని బొత్స సత్యనారాయణ చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్నికలలో అధికార పార్టీ పూర్తిగా అక్రమాలకు పాల్పడిందన్నారు. తమ బలం పెరిగిందని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పేందుకే సహకార ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీకి మధ్యంతర ఎన్నికలకు పోయే దమ్ముందా అని సవాల్ విసిరారు.
మునిగిపోయే నావ: శివప్రసాద్ రెడ్డి
కాంగ్రెసు మునిగిపోయే నావ అని, త్వరలో చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెసు నుండి జగన్ పార్టీలోకి వస్తారని, తాను రాజీనామా చేసి చాలా రోజులు అయినా ఇప్పుడు సస్పెండ్ చేయడం హాస్యాస్పదం అని దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు.
బొత్సకు థ్యాంక్స్: పేర్ని నాని
పార్టీ నుండి తనను బహిష్కరించినందుకు పిసిసి చీఫ్ బొత్సకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్ని నాని అన్నారు.












Click it and Unblock the Notifications