హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైలు నుంచి సూర్య డైలీ అధినేత నూకారపు విడుదల

By Pratap
|
Google Oneindia TeluguNews

Nukarapu Suryaprakash Rao
హైదరాబాద్: చీటింగ్ కేసులో రెండేళ్ల శిక్షపడిన సూర్య దిన పత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాశ్‌రావు 17 నెలలకే జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు శిక్ష విధించిన ఖైదీలు జైల్లో ఉన్న కాలంలో సెలవులను రెమిషన్‌గా లెక్కిస్తారు. ఆదివారాలు, రెండో శనివారాలు, జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2 వంటి రోజులను సెలవులుగా లెక్కిస్తారు. ఇవన్నీ కలిపినా సూర్యప్రకాశ్‌రావు 17 నెలల జైలు జీవితంలో మూడు నెలలవుతాయి. అయితే జైళ్లశాఖ ఉన్నతాధికారులు తమకున్న విచక్షణాధికారం ఉపయోగించి ఆయనకు నాలుగు నెలల రెమిషన్ ఇచ్చారు.

ఫలితంగా సూర్యప్రకాశ్‌రావు శుక్రవారం విడుదలయ్యారు. కేసు వివరాల్లోకి వెళితే - 1994లో తప్పుడు, ఫోర్జరీ పత్రాలతో విజయా బ్యాంకు నుంచి రూ.2.67 కోట్లు రుణం తీసుకొన్నారు. ఆ మొత్తాన్ని ఎగవేయడంతో బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. కేసు విచారణను 1999లో సీబీఐకి అప్పగించారు. నిందితులపై సీఆర్‌పీసీ 120బీ, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. 2004లో సీబీఐ కోర్టు ఈ కేసులో నిందితులకు రెండేళ్ల శిక్ష విధించింది. సీబీఐ కోర్టు తీర్పుపై సూర్యప్రకాశ్‌రావు అప్పీల్‌కు వెళ్లగా, హైకోర్టు డిస్మిస్ చేసింది.

మళ్లీ అరెస్ట్ కావాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. దీంతో తనకు అనారోగ్యంగా ఉందని, కొన్నిరోజులు గడువు కావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీంతో కేవలం రెండు వారాల గడువు ఇచ్చి ఆ తరువాత అరెస్ట్ కావాలని సుప్రీం ఆదేశించింది. ఆ గడువు కూడా ముగియడంతో ఎమ్మార్ కేసులో వాంగ్మూలం ఇవ్వాలంటూ సిబిఐ అధికారులు ఆయనను పిలిపించి 2011 సెప్టెంబర్ 15న అరెస్ట్ చేశారు.

అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా నిబంధనల ప్రకారమే నూకారపు సూర్యప్రకాశ్‌రావుకు రెమిషన్ ఇచ్చామని జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు.

English summary
Surya daily owner Nukarapu Suryaprakash Rao has been released from the jail, who was sentenced in a cheating case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X