బొత్స చిచ్చు: కిరణ్‌కు చిక్కులు, చంద్రబాబుపై ఒత్తిడి

Chandrababu Naidu-Botsa Satyanarayana-Kiran Kumar Reddy
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన 9 మంది శాసనసభ్యులపై బహిష్కరణ వేటు వేశామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన తెర మీదికి వచ్చింది. బొత్స ప్రకటనకు కాంగ్రెసు శాసనసభ్యుడు జోగి రమేష్ ఆజ్యం పోశారు. ప్రభుత్వం మైనారిటీలో పడిందని బొత్స వ్యాఖ్యానించినట్లు ఆయన చెప్పారు. దీంతో ప్రభుత్వ మనుగడపై ప్రశ్నలు ప్రారంభమయ్యాయి.

బొత్స వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిక్కుల్లో పడగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి పెరుగుతోంది. బల నిరూపణకు సిద్ధపడాల్సిన అనివార్యతను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి తెచ్చే పెట్టే స్థితిని జోగి రమేష్ వ్యాఖ్యలు కల్పిస్తున్నాయని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధపడాలని ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ ఆ డిమాండ్ పెట్టారు.

ఇకపోతే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడిందని అంటూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఒత్తిడి పెడుతోంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారా, ప్రభుత్వాన్ని కాపాడుతారా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఎంవి మైసురా రెడ్డి శనివారం డిమాండ్ చేశారు.

జోగి రమేష్ వ్యూహాత్మకంగానే ప్రకటన చేసినట్లు కనిపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్న ఆయన మైనారిటీలో పడిన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తెలుగుదేశం పార్టీ సాయంతో గట్టెక్కుతారా అని ఆయన అడిగారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కమ్మక్కయ్యాయనే పాత ఆరోపణను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరోసారి ఈ రకంగా తెర మీదికి తేవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తోంది.

తెలంగాణ అంశంపై వాతావరణం వేడెక్కిన సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరోసారి చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తోంది. బొత్స సత్యనారాయణ ఉద్దేశం ఏమైనప్పటికీ కాంగ్రెసులో మరోసారి చిచ్చు పెట్టే ఉద్దేశంతో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహరించాలని అనుకుంటున్నట్లు కూడా అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+