పరిటాలశ్రీరాంపై ఇలా, జెసి ఫ్యామిలీ మాటేమిటి?: టిడిపి

JC Diwakar Reddy - Parital Sriram
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి కుటుంబానికి తొత్తుగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి శనివారం ఆరోపించారు. అనంతపురం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మురళీ ప్రసాద్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి కేసులో ఆయన కుటుంబ సభ్యులను ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. టిడిపి నేత ఇంటిపై 2009లో దాడి జరిగిందని, ఆ కేసులో జెసి కుటుంబ సభ్యుల పైన కేసు నమోదయిందని, వారిపై నాన్ బెయిలబుల్ ఉత్తర్వులు జారీ అయ్యాయని అన్నారు.

జెసి కుమారుడు, ఆయన తమ్ముడి కుమారుడు దాడి చేసి నాలుగేళ్లయినా నేటికీ వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 2009 ఏప్రిల్ 24న ఆయన ఇంటిపై దాడి జరిగిందని... ఆ కేసులో జెసి ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి, జెసి దివాకర్‌ రెడ్డి కుమారుడు పవన్‌ కుమార్‌ రెడ్డిపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు జారీ అయినా నేటి వరకు పోలీసులు ఎందుకు వారిని అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు.

జెసి కుమారులు విదేశాల్లో ఉన్నట్లు కోర్టుకు సమాచారం ఇస్తున్నారని.. వాస్తవానికి వారు యథేచ్చగా బయట తిరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. దీని వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని పెద్దిరెడ్డి పోలీసుల్ని నిలదీశారు. ఇప్పటికే జెసి కుటుంబం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, రెండో చార్జ్‌షీట్‌లో తమ పేర్లు లేకుండా చేసి, నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు ఎత్తేసేలా ప్రయత్నాలు చేసిందని.. దీనిని కోర్టు కూడా తప్పు పట్టిందని ఆయన గుర్తు చేశారు.

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌పై ఫిర్యాదు అందిన వెంటనే తప్పుడు సెక్షన్లతో కేసులు నమోదు చేసి, అతణ్ని అరెస్టు చేయడానికంటూ అర్ధరాత్రి సోదాలు నిర్వహించారని, అదే ఉత్సాహం జెసి కుటుంబంపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం ఎందుకు చూపడం లేదని ఆయన నిలదీశారు. శ్రీరామ్ పైన తప్పుడు కేసులు బనాయించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+