వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కింగ్ ఫిషర్ ఫ్యాషన్ షోకు బ్రేక్: దేవుళ్ల బొమ్మలు, కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Break to Vishaka Fashion Show
విశాఖపట్నం: విశాఖలో కింగ్ ఫిషర్ ఫ్యాషన్ వీక్‌కు బ్రేక్ పడింది. మహిళా సంఘాలు, విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి) ఆందోళనల నేపథ్యంలో విశాఖలో జరుగుతున్న కింగ్ ఫిషర్ ఫ్యాషన్ వీక్‌ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఆందోళనలతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ఆందోళనకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు నిర్వాహకులతో మాట్లాడి షోను నిలుపుదల చేయించారు.

ఆదివారం ఉదయం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జివిఎంసి) ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మహిళా, విద్యార్థి, యువజన, కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మహిళలను అసభ్యంగా చూపించడం పైన, హిందూ దేవతలను కురచ దుస్తుల పైన ముద్రించడం పైన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యాషన్ షోలో దేవుడి బొమ్మలను ముద్రించి ఉన్న దుస్తులను వేసుకుంటున్నారని మరోవైపు విహెచ్‌పి ఆందోళన చేపట్టింది.

వారు విశాఖ మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా పలువురి నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పోలీసుల జోక్యంతో నిర్వాహకులు తగ్గారు. విహెచ్‌పి ఫిర్యాదుతో పోలీసులు నిర్వాహకుల పైన 295ఏ సెక్షన్ కింద కేసును నమోదు చేశారు.

ఫ్యాషన్ షో రద్దు మహిళలు, ఉద్యమకారుల విజయంగా మహిళా సంఘాల నేతలు, హక్కుల సంఘాల నేతలు అన్నారు. కాగా విశాఖలో కింగ్ ఫిషర్ ఫ్యాషన్ షో ఈ రోజు మూడో రోజు. ఫిబ్రవరి ఒకటిన ప్రారంభమైన ఈ షో రెండు రోజులు సాగింది. మూడో రోజు ఆందోళనకారుల కారణంగా నిలిపివేశారు.

English summary
Break to Vishaka Fashion Show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X