మాజీ మంత్రి, ప్రథమ మహిళా మేయర్ సరోజిని మృతి

దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఆమె సన్నిహితురాలు. ఆమె కాంగ్రెసు పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా పని చేశారు. మంత్రిగా పని చేశారు. హైదరాబాదుకు తొలి మహిళా మేయర్ అయి రికార్డులకెక్కారు. 1979లో రాష్ట్ర పురపాలక శాఖకు, ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా పని చేశారు.
సరోజిని పుల్లా రెడ్డి మృతి పట్ల పలువురు కాంగ్రెసు నేతలు తమ సంతాపం తెలియజేశారు. పలువురు కాంగ్రెసు నేతలు బోయిన్ పల్లిలోని ఆమె నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తదితరులు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!