వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ వద్దకు మహిళ ప్లేయర్లు: గోకరాజుపై ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Compalaint against Gokaraju
న్యూఢిల్లీ: ఏసిఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు పైన యువజన కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి తుమ్మల పద్మ సోమవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వద్దకు మహిళా ప్లేయర్లను తీసుకు వెళ్లారని గోకరాజు గంగరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పరిశీలించిన అనంతరం కేసును నమోదు చేస్తామని చెప్పారు.

కాగా సచిన్ టెండుల్కర్ ఆటోగ్రాఫ్ ఇప్పిస్తానని, ఆయనతో ఫోటో దిగేలా చేస్తానని చెప్పి నలుగురు మహిళా క్రికెటర్లను ఏసిఏ మాజీ కార్యదర్శి చాముండేశ్వరినాథ్ తీసుకు వెళ్లడం ఏమిటని ఏసిఏ ప్రస్తుత కార్యదర్శి గోకరాజు గంగరాజు శనివారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. చాముండి గురించి అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ఆయనపై ఆరోపణలు రావడంతో గతంలో ఏసిఏ కార్యదర్శి పదవి నుండి తొలగించామని, అలాంటి వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల సచిన్‌కు చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సచిన్ వద్దకు చాముండి అమ్మాయిలను తీసుకు వెళ్లారని, మహిళా క్రికెటర్ల శిక్షణ శిబిరం జరుగుతుంటే వాళ్లలోంచి నలుగురిని స్టార్ హోటల్లో జిమ్‌కు పిలిపించారని గోకరాజు ఆరోపించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో ఇది మరోసారి వివాదానికి దారి తీసింది. నలుగురినే చాముండి.. సచిన్ వద్దకు తీసుకు వెళ్లడమేమిటని, మంచి ఉద్దేశంతో తీసుకెళ్తే మొత్తం జట్టునంతటినీ తీసుకెళ్లాలని, జట్టులో 12 మంది క్రికెటర్లుండగా ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఉన్న జిమ్‌లోకి కేవలం నలుగురు అమ్మాయిలనే చాముండి తీసుకు వెళ్లారని ఆరోపించారు.

సచిన్ అంటే తనకు అపార గౌరవం ఉందని.. కానీ అలాంటి వ్యక్తి చాముండేశ్వరినాథ్ లాంటి వాళ్లను పక్కన పెట్టుకోవడమే తనకు బాధాకరంగా అనిపించిందని గంగరాజు శనివారం వ్యాఖ్యానించారు. దీనివల్ల ఆయన ఇమేజికి కూడా భంగం వాటిల్లుతుందన్నారు. సచిన్ తిరుపతి వస్తున్నట్లు అసలు ఏసీఏకు సమాచారం కూడా లేదని, ఇప్పటికైనా సచిన్ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు.

అయితే.. గంగరాజు ఆరోపణలపై చాముండేశ్వరి కూడా తీవ్రంగా స్పందించారు. పదవిని కాపాడుకోడానికే గంగరాజు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సచిన్ టెస్ట్ మ్యాచ్‌గానీ, వన్డే మ్యాచ్‌గానీ అడటానికి వస్తే ఆయన్ను కలిసేందుకు కుదరదని.. దులీప్ ట్రోఫీ ఆడేందుకు వచ్చినందున కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆయనతో ఫొటోలు తీయించుకోవాలనుకునేవారు, ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకునేవాళ్లు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా తాను చెప్పానని ఆయన తెలిపారు.

అయితే ఆ సమయంలో అక్కడున్నవారిలో మిగిలిన అమ్మాయిలు అప్పటికే తాము వచ్చి 12 రోజులు అయినందున వెళ్లిపోతామన్నారని, నలుగురు మాత్రమే ఆసక్తి చూపడంతో వారిని తీసుకుని వెళ్లానని, దీనిపై గంగరాజు ఇలా వ్యాఖ్యానించడం సరికాదని చెప్పారు. ఇంత మాట అన్నప్పుడు మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. మహిళా క్రికెటర్లు ఏం తప్పు చేశారని వాళ్లు మాటలు పడాల్సి వస్తోందని నిలదీశారు.

English summary
Youth Congress General Secretory complained against ACA's Gokaraju Gangaraju on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X