జైల్లో జగన్‌తో చింతలపూడి ఎమ్మెల్యేభేటీ: ముహూర్తం..

జగన్ సూచనల మేరకు రాజేష్ ఈ రోజే గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో జగన్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవలే జగన్ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మద్దాల రాజేష్ పేరు కూడా ఒకటి. జగన్ పార్టీలో చేరుతానని ఆయన ఇప్పటికే ప్రకటన చేశారు.
కాగా జగన్ పార్టీలోకి వెళ్తానని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేష్ గతంలోనే తన శాససనభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజేష్ మూడు నెలల క్రితం స్పీకర్ నాదెండ్ల మనోహర్ కార్యాలయానికి చేరుకొని తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అతను తన లేఖను కార్యాలయంలో అందజేశారు. రాజేష్ గతంలో పలుమార్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, జగన్‌ను కలిశారు.
జగన్ పార్టీలో చేరేందుకు సిద్దపడ్డ రాజేష్.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను కార్యకర్తగా పని చేస్తానని, వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తాను శాసనసభ్యుడిగా విజయం సాధించానని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకున్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications