ఆర్టీఐ కమిషనర్లుగా ఆ నలుగురే: నెగ్గిన కిరణ్ పంతం

గతంలో ఈ నలుగురి పేర్లను గవర్నర్ తిప్పి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అదే దస్త్రాన్ని పంపించారు. దీంతో గవర్నర్ ఆ ఫైలుకు ఆమోదం తెలిపారు. పది నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి, నరసింహన్‌ల మధ్య ఈ అంశం కోల్డ్ వార్‌ను తలపించింది. అప్పుడు ప్రభుత్వం తాంతియా కుమారి, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, విజయ్ బాబు, ప్రభాకర్, మధుకర్ రాజు, రతన్ పేర్లతో కూడిన ఫైలును పంపించింది.
అయితే గవర్నర్ కేవలం విజయ్ బాబు, ప్రభాకర్, మధుకర్ రాజు, రతన్ పేర్లను మాత్రమే ఆమోదించారు. మిగిలిన నలుగురి పేర్లను తిరస్కరించారు. ఇది అప్పట్లో చర్చకు దారి తీసింది. తాను తిరస్కరించిన వారిపై న్యాయసలహాలు తీసుకోవాలని గవర్నర్ అప్పట్లో ప్రభుత్వానికి సూచించారు. అయితే కిరణ్ ప్రభుత్వం దాదాపు సంవత్సరం తర్వాత తిరిగి వారి పేర్లనే గవర్నర్‌కు పంపించింది.
పంతం నెగ్గించుకున్న కిరణ్
ఆర్టీఐ కమిషనర్లుగా తాను మొదట సూచించిన ఇంతియాజ్ అహ్మద్, తాంతియా కుమారి, విజయ నిర్మల, వెంకటేశ్వర్లుల పేర్లను గవర్నర్‌చే ఆమోదింప చేసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారని చెప్పవచ్చు. ఏడాది క్రితం తిరస్కరించిన గవర్నర్ ఇప్పుడు వాటికి ఓకె చెప్పాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏదైనా ఫైలును రెండోసారి పంపిస్తే గవర్నర్ సంతకం చేయాల్సి ఉంటుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications