• search
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఫొటోలు: తెలంగాణపై ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు

By Pratap
|

హైదరాబాద్: తొలి విడత వైయస్ రాజశేఖర రెడ్డి మొదటి విడత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు నుంచి తెలంగాణ సమస్య రగులుతోంది. అయితే, 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. దాంతో అప్పుడప్పుడు తెలంగాణ అంశం చర్చకు వచ్చినప్పటికీ తీవ్రమైన సమస్యగా కాంగ్రెసు పార్టీకి అనిపించలేదు. తెలంగాణకు అనుకూలంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తూ కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కాలం గడిపింది.

ఆ తర్వాత 2009 ఎన్నికలు వచ్చేనాటికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు పార్టీతో తెగదెంపులు చేసుకుని తెలుగుదేశం పార్టీతో పొత్తుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇవ్వడమనే ప్రధానమైన పరిణామం ఈ ఎన్నికలకు ముందు చోటు చేసుకుంది. అయితే, తెలుగుదేశం తెరాసతో, వామపక్షాలతో కట్టిన కూటమి దెబ్బ తిన్నది. మరోవైపు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.

చిరంజీవి కారణంగా, మహా కూటమిలోని పొత్తులోని లొసుగుల వల్ల, నిర్హేతుకంగా జరిగిన సీట్ల పంపకం వల్ల, మహాకూటమిలోని పార్టీల మధ్య సమన్వయం కొరవడం వల్ల, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అతి విశ్వాసం వల్ల మహాకూటమి ఓడిపోయి, వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. రెండోసారి గెలిచిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీనే కాకుండా తెరాసను కూడా కూకటివేళ్లతో పెకిలించడానికి ఆ పార్టీల నాయకులను కాంగ్రెసులోకి తీసుకోవడం ప్రారంభించారు.

ఫొటోలు: తెలంగాణపై ఆ ముగ్గురు సిఎంలు

రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకుంటాననే ధీమాను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తం చేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణకు వెళ్లాలంటే వీసాలు, పాస్‌పోర్టులు కావాల్సి వస్తుందని సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెరాస అంతు చూడడానికి ప్రజాదరణ గల నాయకులకు వల వేశారు. వైయస్సార్ ఇలా చేస్తే తెరాస ఉంటుందా, ఉండదా అనే అనుమానాలు కూడా కలిగాయి. తెలంగాణలోని బలమైన యువ శానససభ్యులను తెరాస నాయకులకు అడ్డు పెట్టి, అభివృద్ధి మంత్రాన్ని వినిపింపజేస్తూ వచ్చారు. దీంతో కెసిఆర్ పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపించారు.

ఫొటోలు: తెలంగాణపై ఆ ముగ్గురు సిఎంలు

వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఆయన దీక్ష చేపట్టకుండానే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. కెసిఆర్ నిరాహార దీక్ష నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారు.

ఫొటోలు: తెలంగాణపై ఆ ముగ్గురు సిఎంలు

వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన రోశయ్య చేతుల్లోంచి తెలంగాణ అంశం జారిపోయినట్లే కనిపించింది. చిదంబరం ప్రకటనకు ముందు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణకు అనుకూలంగా రాజకీయ పార్టీలు చేసిన తీర్మానంతో రోశయ్య ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చేలోపల తెలంగాణకు అనుకూలంగా చిదంబరం ప్రకటన వచ్చింది. దాంతో తెలుగుదేశం, కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికి క్యూ కట్టారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చేయాలని చిదంబరం చేసిన సూచనను రోశయ్య పక్కన పడేశారు. దీంతో రోశయ్య తెలంగాణ గండం నుంచి గట్టెక్కారు.

ఫొటోలు: తెలంగాణపై ఆ ముగ్గురు సిఎంలు

ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ సమస్యను ఎలా ఎదుర్కుంటారనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటారనే ధీమాతో సీమాంధ్ర నాయకులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణపై కిరణ్ కుమార్ రెడ్డి సూచనలను కాంగ్రెసు అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందా, తనకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకుంటుందా అనేది సందేహంగా ఉంది. తెలంగాణ నేతల ఒత్తిడికి కాంగ్రెసు తలొగ్గి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదనే చిన్నపాటి అనుమానం కూడా కలుగుతోంది. అదే జరిగితే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనేది ఉత్కంఠ కలిగించే విషయమే.

ఫొటోలు: తెలంగాణపై ఆ ముగ్గురు సిఎంలు

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే నేతగా చాలా మంది సీమాంధ్ర నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే జగన్ తెలంగాణ సమస్యను కట్టడి చేస్తారని చెప్పే నాయకులు చాలా మందే ఉన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసి ఉంటే, తెలంగాణ సమస్య రగిలి ఉండేది కాదని, ఎప్పుడో సమసిపోయి ఉండేదని అనేవారు చాలా మందే ఉన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో సీనియర్ మంత్రి కె. రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రోశయ్యకు తెలంగాణ సమస్య తలనొప్పిగానే పరిణమించింది. రోశయ్య ప్రభుత్వ హయాంలోనే కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఫలితంగా 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. అయితే, రోశయ్య తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల సీమాంధ్ర శానససభ్యుల తిరుగుబాటుతో ఆ గండం గట్టెక్కారు.

రోశయ్య హయాంలో తెలంగాణ సమస్యతో పాటు వైయస్ జగన్ వ్యవహారం తీవ్ర సమస్యగా పరిణమించింది. వైయస్ జగన్‌ను కట్టడి చేసి, శానససభ్యులను తన వైపు తిప్పుకోవడంలో రోశయ్య విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. రాష్ట్ర రాజకీయ వ్యవహారాలు రోశయ్య పట్టు తప్పినట్లు కనిపించాయి. దీంతో రోశయ్యను తప్పించి శానససభ స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది.

కిరణ్ కుమార్ రెడ్డి కూడా జగన్ రాజకీయాలను, తెలంగాణ సమస్యను ఎదుర్కుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెసును గెలిపించలేకపోయారు. ఉప ఎన్నికల్లో గెలిచిన రెండు సీట్లు కూడా కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవి ఖాతాలోకి వెళ్లాయి. కాంగ్రెసు శానససభ్యులు జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరకుండా నిరోధించడంలో కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారనే చెప్పాలి.

ఆ విషయాన్ని అలా వుంచితే, తెలంగాణ సమస్యను తేల్చాల్సిన అనివార్యతలో కాంగ్రెసు అధిష్టానం పడింది. తెలంగాణ సమస్యను తేల్చే విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానానికి చేస్తున్న సూచనలు ఏమిటి అనేది తెలియడం లేదు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కుంటారనేది చూడాల్సి ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
21,84,467
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  0.00%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  100.00%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  3.89%
  ఎస్సీ
 • ఎస్టీ
  1.24%
  ఎస్టీ

English summary
Telangana issue has became main issue for the three chief ministers late YS Rajasekhar Reddy, K Rosaiah and Kiran Kumar Reddy within less than 5 years.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more