బిజెపి కార్పోరేటర్ ప్రమాణానికి అడ్డు!: కౌన్సిల్ వాయిదా

Demands council meeting: BJP and TDP corporators held for protest at GHMC
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి) ప్రత్యేక బడ్జెట్ సమావేశాన్ని మేయర్ మాజిద్ హుస్సేన్ బుధవారం నిరవధిక వాయిదా వేశారు. సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేయడాన్ని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్పోరేటర్లు నిరసించారు. వారు మేయర్ సమావేశ మందిరంలోనే బైఠాయించారు. పలువురు మహిళా కార్పోరేటర్లు మేయర్ ఛాంబరును ముట్టడించారు.

మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉదయం సమావేశమైన తర్వాత హైదరాబాద్ తొలి మేయర్ సరోజిని పుల్లారెడ్డి మృతికి సంతాప తీర్మానం చేశారు. అనంతరం మేయర్ వాయిదా వేశారు. దీంతో బిజెపి, టిడిపి కార్పోరేటర్లు చాంబర్ వద్ద బైఠాయించారు. పోలీసులు ఆందోళన చేస్తున్న కార్పోరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

బిజెపి కార్పోరేటర్‌చే ప్రమాణం చేయించకుండా ఉండేందుకే!

జిహెచ్ఎంసికి జరిగిన అప్పటి ఎన్నికల్లో లంగర్ హౌస్ నుండి మజ్లిస్ పార్టీ కార్పోరేటర్ ఎన్నికైనట్లుగా ప్రకటించారు. దీంతో బిజెపి తరఫున పోటీ చేసిన ఉదయ్ కుమార్ కోర్టుకు వెళ్లాడు. హైకోర్టు మజ్లిస్ పార్టీ కార్పోరేటర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ.. బిజెపి కార్పోరేటర్ ఉదయ్ కుమార్ గెలిచినట్లుగా ప్రకటించింది. ఇది జరిగి నెలలు గడుస్తోంది. హైకోర్టు గెలిచినట్లుగా ప్రకటించిన బిజెపి కార్పోరేటర్ ఉదయ్ కుమార్‌చే ప్రమాణం చేయించకుండా ఉండేందుకు మజ్లిస్‌కు చెందిన మేయర్ మాజిద్ హుస్సేన్ మొదటి నుండి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మూడు రోజుల క్రితం జిహెచ్ఎంసి కౌన్స్లిల్ ప్రారంభమైనప్పుడు కూడా ఇలాగే జరిగింది. మొదట మజ్లిస్ కార్పోరేటర్లు తమ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అరెస్టును నిరసిస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు. అనంతరం ఉదయ్ కుమార్‌చే ప్రమాణ స్వీకారం చేయించాలని బిజెపి కార్పోరేటర్లు పట్టుబట్టారు. దీంతో మేయర్ సమావేశాన్ని ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు నిరవధిక వాయిదా వేశారు. దీంతో ప్రత్యేక బడ్జెట్ సమావేశం వాయిదా పడింది. బిజెపి చాలా రోజుల నుండి తమ పార్టీకి చెందిన మేయర్‌తో ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేస్తున్నా మేయర్ మాత్రం వాయిదాలు వేస్తూ ప్రమాణ స్వీకారం జరగకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+