తెలంగాణ సెగ: ఓయు స్నాతకోత్సవానికి గవర్నర్ దూరం

Narasimhan
హైదరాబాద్: తెలంగాణ సెగతో ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) 79వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దూరంగా ఉండనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరైతే తాము అడ్డుకుంటామని, పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఓయూకు చెందిన పలు తెలంగాణ విద్యార్థి సంఘాలు హెచ్చరించారు.

విద్యార్థి సంఘాల హెచ్చరికల నేపథ్యంలో భద్రత దృష్ట్యా తన పర్యటనను గవర్నర్ రద్దు చేశారు. నిఘా విభాగం సూచన మేరకు ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని గవర్నర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దేశంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటి. దీని 79వ స్నాతకోత్సవ వేడుకలు గురువారం ఉదయం జరుగుతున్నాయి.

ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. గవర్నర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో స్నాతకోత్సవానికి చివరి నిమిషంలో గోవర్దన్ మెహతాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

దీంతో ఓయూ క్యాంపస్‌లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొన్ని విద్యార్థి సంఘాలు గవర్నర్ పర్యటనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ప్రగతిశీల విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) గురువారం ఓయు బంద్‌కు పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+