గోప్యంగా ఉరి: జైలులోనే అఫ్జల్ గురు అంత్యక్రియలు

అఫ్జల్ గురు మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి జనవరి 21వ తేదీన తిరస్కరించినట్లు, ఫిబ్రవరి 4వ తేదీన తాను ఫైల్‌పై సంతకం చేసినట్లు ఆయన తెలిపారు. కాశ్మీర్ పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన అన్నారు. అఫ్జల్ గురు విషయంలో చట్టం తన పని తాను చేసిందని హోంశాఖ ఉన్నతాధికారి ఆర్‌కె సింగ్ వ్యాఖ్యానించారు.
అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఇవ్వలేదని అతని సోదరుడు ముస్తాక్ గురు చెప్పారు. తన సోదరుడి మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆయన కోరారు. అయితే, అఫ్జల్ గురు మృతదేహానికి అధికారులు తీహార్ జైలులోనే అంత్యక్రియలు నిర్వహించారు.
అఫ్జల్ గురును ఉరి తీసిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. మైనారిటీలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. మార్కెట్లలో, రైల్వే స్టేషన్లలో, బస్సు టర్మినల్స్ వద్ద గస్తీని ముమ్మరం చేశారు. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కుంభమేళాకు భద్రతను పెంచారు. విశాఖపట్నం తీరంలో నేవీ గస్తీని ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications