అఫ్జల్ గురు: ఎంబిబిఎస్ చదువుతూ ఉగ్రవాదం వైపు..

Afzal Guru
న్యూఢిల్లీ: ఉగ్రవాద శిబిరంలోకి వెళ్లకుండా ఉండి ఉంటే అఫ్జల్ గురు జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో ప్రసిద్ధమైన వైద్యుడిగా ప్రజల మన్ననలు పొందుతూ ఉండేవాడు. పార్లమెంటుపై దాడి కేసులో అతనికి శనివారం తీహార్ జైలులో ఉరి పడింది. అతని జీవితం అర్థాంతరంగా ముగిసింది. పరిస్థితులు అతన్ని ఉగ్రవాదం వైపు నడిపించి ఉండకపోతే అతను సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపు పొందేవాడు.

అఫ్జల్ గురు బారాముల్లాలో జన్మించాడు. అక్కడే విద్యాభ్యాసం చేశాడు. చదువులో చురుగ్గా ఉండేవాడు. పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తల్లిదండ్రుల కోరికను పరిపూర్ణం చేయడానికి అతను ప్రీమెడికల్ పరీక్ష రాసి, మంచి ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత ఎంబిబిఎస్ చదవడం ప్రారంభించాడు. ఎంబిబిఎస్ చదవుతూనే ఐఎఎస్ పరీక్ష కోసం చదవడం ప్రారంభించాడు. అదే సమయంలో అతను జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సభ్యుడిగా చేరాడు.

విద్యార్థి దశలోనే అతనికి ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయి. అతను అప్పుడే ఉగ్రవాద శిక్షను పొందాడు. అయితే, దేశంపై యుద్ధం చేయడం అతని మనసుకు నచ్చలేదు. దీంతో బిఎస్ఎఫ్ సమక్షంలో ప్రభుత్వానికి లొంగిపోయాడు. దాంతో అతను సాధారణ జీవితంలోకి వచ్చి పడ్డాడు. బారాముల్లా వదిలేసి సోపోర్‌కు చేరుకున్నాడు. వ్యాపారాన్ని ప్రారంభించాడు. కమిషన్ ఏజెన్సీ పెట్టుకున్నాడు. అయితే, ఆ జీవితాన్ని కొనసాగించలేకపోయాడు.

ఉగ్రవాదుల నుంచి దూరంగా పారిపోతున్నా కొద్దీ వారు అతని వెంట పడడం ప్రారంభించారు. అదే సమయంలో అనంతనాగ్‌లో తారీక్‌తో సంబంధం ఏర్పడింది. అతనితో పాటు కాలం గడుపసాగాడు. తారీక్ ఉగ్రవాది అనే విషయం అఫ్జల్‌కు తెలియదు. క్రమంగా మళ్లీ తారీక్ ద్వారా అఫ్జల్ గురు ఉగ్రవాదంవైపు అడుగులేయడం ప్రారంభించాడు. తారీక్ పాకిస్తాన్‌లోని ఘజియాబాద్‌కు చెందిన కొంత మందిని అఫ్జల్ గురుకు పరిచయం చేశాడు. దాంతో అఫ్జల్ గురు ఫిదాయిగా మారిపోయాడు.

పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు పెరుగుతున్న క్రమంలో వారంతా కలిసి యంత్రాంగాన్ని ఏర్పాటైంది. భారతదేశంలోని ముఖ్య స్థలాలపై దాడులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వారి లక్ష్యం దేశరాజధాని ఢిల్లీ. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ కలిసి దాడులకు పథకం రచించాయి. ఆ పథకం ప్రకారమే 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంటుపై దాడి జరిగింది. ఈ కుట్రకు సంబంధించి పోలీసులు అఫ్జల్ గురును దర్యాప్తు అధికారులు అరెస్టు చేసి న్యాయస్థానాల ముందు నిలబెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+