గోకరాజుపై సత్యనారాయణపురం పిఎస్‌లో కేసు!

కాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వద్దకు మహిళా ప్లేయర్లను తీసుకు వెళ్లారని గోకరాజు గంగరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పరిశీలించిన అనంతరం కేసును నమోదు చేస్తామని చెప్పారు. గోకరాజు పైన యువజన కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి తుమ్మల పద్మ కూడా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అంతకుముందు మసచిన్ టెండుల్కర్ ఆటోగ్రాఫ్ ఇప్పిస్తానని, ఆయనతో ఫోటో దిగేలా చేస్తానని చెప్పి నలుగురు మహిళా క్రికెటర్లను ఏసిఏ మాజీ కార్యదర్శి చాముండేశ్వరినాథ్ తీసుకు వెళ్లడం ఏమిటని ఏసిఏ ప్రస్తుత కార్యదర్శి గోకరాజు గంగరాజు గత శనివారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. చాముండి గురించి అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
ఆయనపై ఆరోపణలు రావడంతో గతంలో ఏసిఏ కార్యదర్శి పదవి నుండి తొలగించామని, అలాంటి వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల సచిన్‌కు చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సచిన్ వద్దకు చాముండి అమ్మాయిలను తీసుకు వెళ్లారని, మహిళా క్రికెటర్ల శిక్షణ శిబిరం జరుగుతుంటే వాళ్లలోంచి నలుగురిని స్టార్ హోటల్లో జిమ్‌కు పిలిపించారని గోకరాజు ఆరోపించారు.












Click it and Unblock the Notifications