వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పత్రిక పెట్టేది లేదు, జగన్ పత్రిక ప్లాప్ అంటోంది: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించినట్లుగా తాను పత్రికను పెట్టనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. ఆయన పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఆయన మాట్లాడారు. జగన్ పత్రిక, టివీకి కళ్లు లేవని, తన పాదయాత్రకు జనం నుంచి విశేష స్పందన వస్తున్నా ప్లాప్ అని విషపు రాతలు రాస్తోందని విమర్శించారు.

ఆ పత్రికకు విలువలు ఏమాత్రం లేవన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, తాను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేశామని, మేం తలచుకుంటే పేపర్ పెట్టలేమా? అని ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా పత్రిక పెట్టనని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డి కిరాణా కొట్టు తెరిచి ఉద్యోగాలిస్తూ డబ్బులు కొట్టేస్తున్నాడని చంద్రబాబు అన్నారు.

హైదరాబాద్‌లో ఒక సోదరుడిని, చిత్తూరులో మరో సోదరుడిని పెట్టి అందినకాడికి దోచేస్తున్నాడని ఆరోపించారు. సమాచార కమిషనర్లుగా ఆదర్శవంతులైన వ్యక్తులను నియమించాల్సిందిపోయి తన మనుషులను నియమించుకొన్నాడని.. ఇంత తప్పుడు, పనికిమాలిన ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ లోటస్‌పాండ్‌లో 72 గదుల్లో ప్యాలెస్ నిర్మించాడని, అందులో దయ్యాలు కాపురాలు చేస్తాయి తప్ప మనుషులు కాదన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్, అల్లుడు బ్రదర్ అనిల్‌పై అవినీతి ఆరోపణలతో చంద్రబాబు విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. అవినీతి విషయంలో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, మన సంపద, కష్టాన్ని దోచుకొన్న వారిపై రాజీలేని పోరాటం చేయాలనిచంద్రబాబు పిలుపునిచ్చారు.

English summary
Telugudesam president N Chandrababu naidu has said 
 
 that YSR Rajasekhar Reddy's son-in-law and Sharmila's 
 
 husband Anil kumar's prayers are fake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X