చెంప పగలకొడతా: ఫోటోజర్నలిస్ట్‌కు మమత బెదిరింపు

Mamata Banerjee
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి మరోసారి కోపం వచ్చింది. ఆమె శనివారం తన సహనాన్ని కోల్పోయారు. మమత పలుమార్లు తరుచూ సహనం కోల్పోయి తన కోపాన్ని ఇతరులపై ప్రదర్శించారు. తాజాగా ఓ ఫోటో జర్నలిస్టు పైనా ఆమె నోరు జారారు. పశ్చిమ బెంగాల్‌లోని బుర్దాన్ జిల్లాలో జరుగుతున్న మాటీ ఉత్సవంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సమయంలో మమతా బెనర్జీని ఫోటో తీసేందుకు ఓ ఫోటో జర్నలిస్టు ఆసక్తి కనబర్చాడు. ఆమెను ఫోటో తీసేందుకు అతను ముందుకు వచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన దీదీ.. మీకు నాగరికత తెలియదు. చెంప పగలగొడతా. ఇక్కడ జరుగుతున్నది మీకు కనిపించడం లేదా? అంటూ సదరు ఫోటో గ్రాఫర్ పైన ఆమె విరుచుకు పడ్డారు. ఆదివారం రోజు అన్ని టీవీ ఛానళ్లలో ఈ సన్నివేశాన్ని పదే పదే ప్రదర్శించారు.

శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో దీదీ మాటీ ఉత్సవంలో ఓ స్టాల్ తిలకిస్తుండగా ఇది జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న దీదీ మూడ్ ఫోటో జర్నిలిస్టు ఫోటో తీసేందుకు ఆత్రుతపడుతూ ముందుకు రావడంతో ఒక్కసారిగా మారిపోయింది. ఫోటో జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పది నిమిషాల తర్వాత మమతా బెనర్జీ అక్కడి నుండి వెళ్లిపోయింది. అయితే ఆమె తీరు అక్కడున్న వారిని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.

ఈ ఐదు రోజుల్లోనే ఆమె సహనం కోల్పోవడం ఇది రెండోసారి. ఇటీవల కోల్‌కతాలో జరిగిన పుస్తక ప్రదర్శనలో తన భద్రతా సిబ్బందిని ఆమె దుర్భాషాలాడారు. తన కారును ఆలస్యంగా తీసుకు రావడంతో ఆమె వారిపై ఆగ్రహం ప్రదర్శించారు. మమతా బెనర్జీ తీరు పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. తాజా ఘటన ఆమె నియంతృత్వ పోకడలకు నిదర్శనమని సిపిఎం ధ్వజమెత్తింది. మమత తీరు దురదృష్టకరమని... ఓపికతో ఉండాలని పిసిసి అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+