విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'నాగార్జునపై దృష్టి పెట్టాలి, గణేష్ కాదు బొత్స ఇంట్లోను'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagarjuna-Botsa Satyanarayana
విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను తరుచూ కలుస్తున్న ప్రముఖ హీరో నాగార్జున పైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అధికారులు దృష్టిలో పెట్టాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య బుధవారం సూచించారు.

నాగార్జున తరుచూ నిమ్మగడ్డను కలవడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వచ్చిన గబ్బర్ సింగ్ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ ఆయన వెనుక ఉన్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లోను సోదాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బండ్ల గణేష్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన వివరాలను బయట పెట్టాలన్నారు.

కాగా తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ వెనక కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉన్నారనే అనుమానాలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు మంగళవారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన వెనక చిరంజీవి, బొత్స సత్యనారాయణ ఉన్నారని గణేష్ గతంలో చెప్పారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఐటి అధికారులు బండ్ల గణేష్ నివాసంపై, కార్యాలయంపై రెండు రోజలు దాదాపు మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఆయనను తమ కార్యాలయానికి తీసుకుని వెళ్లి రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. బండ్ల గణేష్ వెనక ఉన్న బడా నాయకులు ఎవరో స్పష్టం చేయాలని దాడి వీరభద్ర రావు డిమాండ్ చేశారు. బండ్ల గణేష్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

English summary
Telugudesam party leader Varla Ramaiah Rao has suspected the role of the PCC president Botsa Satyanarayana behind producer Bandla Ganesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X