వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ నేతను తోసేసిన హర్షకుమార్, ఘర్షణ

By Pratap
|
Google Oneindia TeluguNews

 YSRCP leader Rajababu attacked
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన మన గ్యాస్- మన హక్కు పేర నిర్వహించిన అఖిల పక్ష సదస్సులో మంగళవారం కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా అమలాపురం కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు శెట్టిబత్తుల రాజబాబును వేదికపై నుంచి కిందికి తోసేశారు.

హర్షకుమార్‌తో పాటు ఆయన కుమారుడు, అనుచరులు కలిసి రాజబాబుపై దాడికి దిగారని వైయస్సార్ కాంగ్రెసు వర్గాలు ఆరోపిస్తున్నాయి. కెజి బేసిన్ పరిధిలో రిలయన్స్, జిఎన్‌పిసి వంటి చమురు సంస్థల వ్యవహారంపై హర్ష కుమార్ మన గ్యాస్ మన హక్కు పేరిట అమలాపురంలో క్షత్రియ కళ్యాణ మంటపంలో సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ సదస్సుకు శాసనసభ్యులు బండారు సత్యానంద రావు, తోట త్రిమూర్తులు, పాముల రాజేశ్వరీదేవి, ఎమ్మెల్సీలు కెవి సత్యనారాయణరాజు, రుద్రరాజు పద్మరాజు తదితరులు హాజరయ్యారు. సదస్సుకు హాజరైన రాజబాబు వేదికపై హర్షకుమార్‌ను నిలదీశారు. తొమ్మిదేళ్లు పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఏం చేశారని, ఇన్నాళ్లు ఈ ఉద్యమం ఎందుకు చేయలేదని అడిగారు.

రాజబాబు ప్రశ్నలతో కాంగ్రెసు వర్గాలు ఆగ్రహం చెందాయి. సభా వేదికపై నుంచి రాజబాబును కిందికి తోసేశారు. ఈ దాడిలో రాజబాబు చొక్కా చినిగిపోయింది. ముఖం, ఛాతీలపై గాయాలయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎంపి హర్షకుమార్, ఆయన తనయుడు సుందరరాజ్, తదితరులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary

 It is alleged that Congress Amalapuram MP Harshakumar has manhandled YSR Congress party leader Rajababu at Amalapuram of East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X