బాబుపై కిరణ్ ప్రశ్నల వర్షం: మీరే విభేదాలంటున్నారని..

రైతుల రుణాలు అన్నిటినీ మాఫీ చేయాలని కేంద్రం అనుకుంటే చేయవచ్చని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ పథకాన్ని చేపట్టే అవకాశాలు లేవన్నారు. గతంలో కేంద్రం రూ.65 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, అప్పట్లో రాష్ట్రంలో రూ.13 వేల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని, ప్రస్తుతం రాష్ట్రంలోనే రైతులు బ్యాంకుల నుంచి రూ.1.16 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారని, అంత మొత్తాన్ని మాఫీ చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? అన్నారు.
ఏ పథకాన్ని ఆపేస్తారో చెప్పాలన్నారు. మన బడ్జెట్టే రూ.1.50 లక్షల కోట్లయితే అభివృద్థి కోసం రూ.50 వేల కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకు రూ.28 వేల కోట్లు నిర్దేషిస్తే రుణ మాఫీ కింద లక్షా 16 వేల కోట్లు చెల్లించాలంటే ఏ పథకాన్ని తీసేస్తారన్నారు. రూపాయికే కిలో బియ్యం, స్కాలర్‌షిప్‌లు లేక పెన్షన్లు తదితర వాటిల్లో ఏది తీసేస్తారని లేదా ఉద్యోగులకు జీతాలకు ఆపేస్తారా? అని ప్రశ్నించారు.
బొత్సతో విభేదాల్లేవు
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు తనకు మధ్య ఎలాంటి విభేదాల లేవన్నారు. పార్టీని బలోపేతం చేసే అంశంపై ఇరువురం రాహుల్‌తో మాట్లాడామన్నారు. తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు మీడియానే ప్రయత్నిస్తోందన్నారు. తాము ఎలాంటి నివేదికలూ ఇవ్వలేదన్నారు. ఇలాంటి సమావేశాలను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పెట్టాలని తామంతా రాహుల్‌కు సూచించామన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా ప్రచారం చేయాలని, వ్యక్తి గత ముద్ర ఉండకూడదన్న ప్రతిపాదనలను ప్రస్తావించగా.. కాంగ్రెస్ టికెట్ ఇస్తేనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, పార్టీ తమపై నమ్మకం ఉంచడం వల్లనే ఈ స్థాయికి ఎదిగామని, పార్టీని కాదని ప్రభుత్వం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. ఒక ప్రత్యర్థి పార్టీని ఎలా ఎదుర్కొంటామో దానిని అలాగే ఎదుర్కొంటామన్నారు.
1977 ఎన్నికల్లో 157 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలిపోయినా 190 సీట్లు గెలిచామని గుర్తు చేశారు. ఒక వ్యక్తి వల్ల పార్టీ నడవడం లేదన్నారు. సంక్రాంతి నాటికే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని భావించానని, కొన్ని సమస్యలు రావడంతోనే ఆలస్యమవుతోందని, ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమ్మె నోటీసుపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కాగా హైదరాబాదుకు తిరుగు పయనమైన సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో విఐపి లాంజుకు వెళ్లిన కిరణ్ అప్పటికే అక్కడున్న యుపి సిఎం అఖిలేష్ యాదవ్‌ను ఆప్యాయంగా పలకరించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!