హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'బ్రదర్ అనిల్‌కు సంబంధం లేదు, చైర్మన్ ఎవరో చెప్పం'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anil Kumar
హైదరాబాద్: మణికొండ శివారులోని ఐదెకరాల భూమిని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ కబ్జా చేసినట్లుగా వస్తున్న ఆరోపణలను మణికొండ ది లైఫ్ చర్చి ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఆదివారం రాత్రి చర్చి విద్యా విభాగం పర్యవేక్షకురాలు మీనాక్షి రాజ్, చర్చి పాస్టర్ డేవిడ్ రాజులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడారు.

తమ చర్చితో బ్రదర్ అనిల్ కుమార్‌కు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బ్రదర్ అనిల్ కుమార్ మత ప్రచారకుడు కాబట్టి అప్పుడప్పుడు తమ వద్దకు ప్రార్థనలకు వస్తారని వెల్లడించారు. మణికొండలోని భూములను తాము ఎవరి దగ్గర నుండి లాక్కోలేదని చెప్పారు. హెచ్‌ఎండిఏ నుంచి తమ సంస్థ 33 ఏళ్లకు అద్దె ప్రాతిపదికన తీసుకుందన్నారు.

విరాళాలు సేకరించి చర్చిని నిర్మించామని, 22 మంది అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నామని చెప్పారు. ఒప్పందం సమయంలో పేర్కొన్న నిబంధనలను పూర్తి చేయనందున ఆ భూమిని వెనక్కి తీసుకుంటున్నట్లు హెచ్‌ఎండిఏ రాసిన లేఖపై ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేశారు. విరాళాల సేకరణ మేరకు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని ఆమె చెప్పారు. ఎనిమిదేళ్లుగా ఎందుకు నిబంధనలు పూర్తి చేయలేదన్న ప్రశ్నకు కూడా ఆమె స్పందించలేదు.

తాము రైతుల భూములు లాగేసుకుని చర్చిలు, అనాథాశ్రమాలు కట్టలేదన్నారు. బ్రదర్ అనిల్ కుమార్‌ను తాము మత ప్రబోధకుడిగానే ఆహ్వానిస్తున్నామని, అతనికి, అతని కుటుంబ సభ్యులకు ఇక్కడి వ్యవహారాలతో సంబంధం లేదని వారు అభిప్రాయపడ్డారు. అయితే, సంస్థ అధ్యక్షులు, చైర్మన్ ఎవరనేది వారు చెప్పలేదు. తాము నాలుగు ఎకరాల భూమిని 2006 అక్టోబర్ 26న లీజుకు తీసుకున్నామని చెప్పారు. తమ ట్రస్ట్ పూర్తిగా ప్రజల విరాళాలతో నడుస్తోందని, దీనిపై బిజెపి అసత్య ప్రచారం చేయడం సరికాదని డేవిడ్ అన్నారు.

English summary
Meenakshi condemned allegations against Brother Anil Kumar on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X