వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై వెనక్కి తగ్గలేదు, సడక్ బంద్ ఓకే: జానా

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy says
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనపై తాము వెనక్కి తగ్గలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆయన గురువారం మీడియాతో అన్నారు తెలంగాణ సాధన కోసం తెలంగాణ జెఎసి తలపెట్టిన సడక్ బంద్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని ఆయన అన్నారు. సడక్ బంద్ ద్వారా తెలంగాణ జెఎసి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటోందని జానా రెడ్డి అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి తీరుతామని ఆయన చెప్పారు. అయితే, ఎన్నికలు ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. పాతపద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని, ఈ విషయంలో అపోహలు వద్దని ఆయన అన్నారు. జానారెడ్డి గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ ఎన్నికలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

తెలంగాణ ప్రజల కోరిక మేరకే తెలంగాణ సరిహద్దుల్లో సడక్ బంద్ చేస్తున్నామని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద యెత్తున ఉద్యోగులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ తెచ్చే శక్తి లేని తెలంగాణ నాయకులు ప్రజల్లోకి వచ్చి ఉద్యమించాలని ఆయన కోరారు.

ఈ నెల 24వ తేదీన 12 కేంద్రాల్లో సడక్ బంద్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. గురువారం టీ. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. ఈనెల 24న నిర్వహించనున్న సడక్ బంద్‌పై చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బంద్ నిర్వహణకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ నేతలతో జేఏసీ నేతలు చర్చించనున్నారు. అలాగే జిల్లా జేఏసీలకు సడక్ బంద్ కేంద్రాల బాధ్యత అప్పగించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.

English summary
The Panchayatraj minister K Janaredy said that they are fighting to achieve statehood for Telangana. He supported sadak bandh to be held by Telangana JAC on Feb 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X