హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌పై మరోసారి నాగం జనార్దన్ రెడ్డి చిందులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తి వరదా రెడ్డికి కెసిఆర్ ఎమ్మెల్సీ సీటు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థిగా కెసిఆర్‌కు ఉద్యమంలో పనిచేసివారు ఎవరూ కనిపించలేదా అని ఆయన అడిగారు. తెలంగాణ జెఎసిలో నియంతృత్వు ధోరణులు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలిస్తే తెలంగామ వచ్చినట్లు కాదని ఆయన అన్నారు.

తెలంగాణ విద్యార్థులపై వరదా రెడ్డి దాడి చేయించారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ఆయన కెసిఆర్‌ను ప్రశ్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు)లో తనపై దాడి చేసిన విద్యార్థులపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై దాడి చేసిన విద్యార్థులపై కేసులు పెట్టవద్దని ఆ రోజే చెప్పానని, అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు ఆ విషయం చెప్పానని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన నాగం జనార్దన్ రెడ్డిపై కొంత మంది విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన కింద పడిపోయారు. తెలంగాణ వ్యతిరేకి అయిన నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో ఉండి, తమ వద్దకు వస్తే సహించబోమని విద్యార్థులు చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం అని అనడం తెరాసకు తగదని ఆయన అన్నారు. ఉద్యమంలో నియంతృత్వ పోకడలకు తావు లేదని అన్నారు. గత కొద్ది కాలంగా కెసిఆర్‌ తీరుపై, తెరాస వైఖరిపై నాగం జనార్దన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.తెలంగాణ జెఎసిలో తనకు సభ్యత్వం ఇవ్వకుండా తెరాస అడ్డుకుంటోందని నాగం జనార్దన్ రెడ్డి ఇటీవల విమర్శించారు. తెలంగాణ కోసం అందరూ ఒకే వేదిక మీదికి రావాలని కూడా ఆయన కోరారు.

English summary
Telangana Nagara Samithi president Nagam Janardhan reddy has lashed out at Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X