ప్రియుడి కోసం: భర్తలను చంపిన ఇద్దరు భార్యలు అరెస్టు

ఈ సెక్యూరిటీ గార్డు తరుచూ మల్లికార్జు ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో చిట్టెమ్మతో వివాహేతర సంబంధం కలిసింది. విషయం తెలియడంతో మల్లికార్జున భార్యను మందలించాడు. దీంతో మల్లికార్జునను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 17 మొదట చిట్టెమ్మ భర్తకు నిద్రమాత్రలు కలిపిన పెరుగన్నం తినిపించింది. ఇంటికి వచ్చిన మరిది ఓబులేసుకు కూడా చిట్టెమ్మ మత్తుమందు కలిపిన పెరుగన్నం పెట్టింది. ఇద్దరు మత్తుగా నిద్రపోయారు.
ఆ తర్వాత రెండో సెక్యూరిటీ గార్డు, మరో వ్యక్తితో కలిసి వచ్చి మత్తులో ఉన్న మల్లికార్జున తలపై రాడుతో మోదారు. దీంతో అతని ప్రాణాలు పోయాయి. అలికిడికి నిద్రలేచిన ఓబులేసును కూడా పెదవి విప్పితే చంపుతామని హెచ్చరించారు. దాంతో అతను నోరు మెదుపలేదు. తర్వాత భార్య చిట్టెమ్మ తన భర్తను ఎవరో చంపారని కథ అల్లింది.
భర్తను చంపిన భార్య
రంగారెడ్డి జిల్లాలో ప్రియుడి కోసం మరో భార్య భర్తను చంపింది. మృతదేహాన్ని దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని ఓ వెంచరులో పూడ్చిపెట్టింది. మొయినాబాద్ మండలం ఎల్కగూడ గ్రామానికి చెందిన లక్ష్మి తన భర్త ఎట్టయ్యను ప్రియుడి కోసం చంపింది. అదే గ్రామానికి చెందిన రాజుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న లక్ష్మి విషయం తెలిసిన భర్త ఎట్టయ్య ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లాడు.
దీంతో భర్తను హతమార్చాలని ప్రియుడు రాజును లక్ష్మి కోరింది. రాజు తన స్నేహితుడితో కల్సి పథకం రచించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇరవై కిలోమీటర్ల దూరంలోని ఓ వెంచర్‌లో పూడ్చి పెట్టారు.












Click it and Unblock the Notifications