హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలుళ్లు: పోలీసులకు బొత్స కితాబు, హెచ్చరికలపై నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని అయితే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. పేలుళ్ల ఘటనను రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్షాలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

రాజకీయ అనిశ్చితికి పేలుళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటనలో అధికారులు, పోలీసుల తప్పేమీ లేదన్నారు. అధికారులను ఆయన వెనుకేసుకొచ్చారు. అంతేకాదు హైదరాబాదు పోలీసులకు బాగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. రెండు రోజుల ముందు నుండే కేంద్రం నుండి హెచ్చరికలు వచ్చిన విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందే సమాధానం చెప్పారన్నారు.

ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలు, ప్రధాని రెండు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారన్నారు. క్షతగాత్రులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ముందే హెచ్చరికలు ఉన్నా పలానా చోట పేలుళ్లు జరుగుతాయని తెలియదన్నారు. కాగా పేలుళ్ల ఘటనలో గాయపడ్డ వారికి తెరాస భవనంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కెటిఆర్, హరీష్ రావు రక్తం ఇచ్చారు.

గాయపడ్డ వారికి రూ.50 నుండి లక్ష వరకు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని మంత్రి డికె అరుణ చెప్పారు. ఉగ్రవాద నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.

కాగా ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల చేసినట్లుగా వస్తున్న వార్తలను పోలీసులు కొట్టిపారేశారు. ఎన్ఐఏ పేరుతో ఎలాంటి ఫోటోలు విడుదల చేయలేదని చెప్పారు.

English summary
PCC chief Botsa Satyanarayana has praised Hyderabad police on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X