హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలుళ్ల ఫొటోలు: హైదరాబాదులో రక్తసిక్తం, హాహాకారాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరోసారి ఉగ్రవాద భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన వాతావరణం గురువారం సాయంత్రం ఒక్కసారిగా భీతావహంగా మారిపోయింది. దిల్‌షుక్‌నగర్‌లో రెండు చోట్ల మూడు బాంబు పేలుళ్లు సంభవించి, ఆ ప్రదేశాలు రక్తసిక్తమయ్యాయి. ఒక్కసారిగా హాహాకారాలు మిన్నుముట్టాయి. ఏం జరిగిందో తెలిసే లోగానే 15 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వంద మందికి పైగా గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు.

దిల్‌షుక్‌నగర్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. బాంబులు రెండు థియేటర్ల వద్ద జరిగాయి. ఈ రెండు థియేటర్ల నుంచి సినిమా చూసి ప్రేక్షకులు బయటకు వచ్చే వేళ. చాలా మంది మార్కెట్ చేసుకునే సమయం. అందరూ కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరిగి వచ్చే వేళ. ఆ సమయం చూసే ఉగ్రవాదులు పంజా విసిరినట్లు కనిపిస్తోంది.

పేలుళ్లు జరిగిన కొద్ది సేపటికి మొబైల్ ఫోన్లు మూగబోయాయి. పలు ప్రాంతాల నుంచి తమ వారి పరిస్థితిని తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తుంటే సమాధానం రాని పరిస్థితి, తీవ్ర ఆందోళన మధ్య తమవారి కోసం వెతుకులాట. ఆస్పత్రుల్లో చేరింది తమవారో కాదో తెలియదు. మరణించినవారిలో తమవారెవరైనా ఉన్నారా అనే ఆందోళన. - రాష్ట్రం ఒక్కసారిగా భయంతో అట్టుడికిని పరిస్థితి.

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

చేయని నేరానికి గాయపడి ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

ఆస్పత్రిలో చికిత్స చేయడానికి ఆఘమేఘాల మీద నర్సులు, వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పడకలపై క్షతగాత్రులు.

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

శవాల పక్కన రక్తమోడుతూ ఓ వ్యక్తి బిక్క చచ్చిపోయి దిక్కులు చూస్తూ...

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

సంఘటనా స్థలం అధికారుల పరిశీలన.

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

ఇండియన్ ముజాహిదీన్ హైదరాబాద్‌ను టార్గెట్ చేసినట్లు హెచ్చరిక చేసిన వార్తాకథనం ఓ పత్రికలో...

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

ఓ హిందీ పత్రికలో హైదరాబాదీ హాహాకారాల చిత్రం..

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

ఆప్తురాలని కోల్పోయి కంటికీ మింటికీ ఏకధాటిగా రోదిస్తున్న బంధువులు..

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం.

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

ఇలా జరుగుతుందనుకోలేదన్నట్లుగా నిండు దుస్తుల్లో రక్తమోడి ఇలా ఆస్పత్రికి...

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

సంఘటనా స్థలంలో దర్యాప్తు బృందాలు..

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

సంఘటనా స్థలంలో పొగలు కక్కుతూ కాలిపోయిన వాహనాలు.

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

సంఘటనా స్థలం ఇలా చిందరవందరగా కుప్పకూలి...

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు అధికారులు ఇలా...

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

దర్యాప్తు అధికారులు, పోలీసులు సంఘటనా స్థలంలో...

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

సంఘటనా స్థలంలో వాహనాలు దగ్ధమై ఇలా...

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

సంఘటనా స్థలంలో ఏం జరిగిందో అర్థం కాక ప్రజలు ఇలా గుమిగూడి...

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు..

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇలా ఆస్పత్రుల పాలైన అమాయకులు..

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

తమ వారి కోసం రెక్కలు తెగిన పక్షిలా రోదిస్తున్న మహిళ..

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

ఎందుకు వచ్చారో, ఎందుకు గాయపడ్డారో, ఎవరి ఘాతుకమో తెలియని అమాయకులు ఇలా..

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

సంఘటనా స్థలంలో బీభత్స వాతావరణం...

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

వెంటలేటర్ ద్వారా బతకడానికి ప్రయత్నాలు చేస్తున్న ఓ క్షతగాత్రుడు..

పేలుళ్ల ఫొటోలు: రక్తసిక్తం, హాహాకారాలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇలా ఓ క్షతగాత్రుడు..

ఆస్పత్రులు క్షతగాత్రులతో, తమ వారి కోసం వచ్చినవారితో క్రిక్కిరిసిపోయాయి. అంతటా ఓ విషాద బీభత్స వాతావరణం. అందరి ముఖాల్లో భయమూ, ఆందోళనా... తమ వారికి ఏమీ జరగకూడదనే ఆశ.. ఆస్పత్రుల్లో రోదనలు మిన్నంటే పరిస్థితి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మొదటి నుంచీ దిల్‌షుక్‌నగర్ ఉగ్రవాదులకు టార్గెట్‌గా ఉంటూ వస్తోంది. గతంలో కూడా బాంబు పేలుళ్లకు ప్రయత్నాలు జరిగాయి.రక్తమోడుతున్న శరీరాలతో కొంత మంది శవాల మధ్య దిక్కు తోచని పరిస్థితిలో బిక్కచచ్చిపోయారు.

English summary
A dazed child with blood pouring down her forehead and a 60-year-old man shrieking with pain summed up the scene in the city hospitals as hundred of injured people poured in with torn limbs, shrapnel wounds and blood-spattered bodies soon after the twin blasts in Dilsukhnagar on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X