ఇద్దరు అనుమానితుల గుర్తింపు: బీహార్‌కు ఎన్ఐఎ

రెండో యువకుడు ఆకుపచ్చ చొక్కా, తెల్లటి ప్యాంట్ వేసుకున్నాడు. ఈ ఇద్దరు యువకులు కూడా దిల్‌షుక్‌నగర్ చౌరస్తాలో సైకిల్‌పై కోణార్క్ థియేటర్ వైపు వెళ్తూ ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించారు. దీంతో ట్రాఫిక్ పోలీసు వారిని ఆపాడు. సైకిల్ క్యారియర్‌పై గోధుమ రంగు సంచీ కూడా ఉంది. రెండు నిమిషాల తర్వాత వారు సైకిల్‌ను నడిపించుకుంటూ కోణార్క్ థియేటర్ వైపు వెళ్లారు. ఈ మొత్తం దృశ్యం సిసిటివీ కెమెరాలో రికార్డు అయింది.
సిసిటివి కెమెరాలో రికార్డయిన ఆ ఇద్దరు యువకుల ముఖ కవళికలు కూడా స్పష్టంగా ఉన్నాయి. వారిని గుర్తించడానికి బెంగళూర్ నుంచి ఎటిఎస్ బృందం బయలుదేరింది. ఫుటేజీ ఆధారంగా ఒక అనుమానితుడిని గుర్తించినట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే, గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నిందితులైన సరోజ్, అలిబాయ్‌లను నెల్లూరు జిల్లా జైలులో మక్బూల్ కలిసినట్లు జైలు ఉన్నతాధికారి కూడా నిర్ధారించారు. వారిని ప్రశ్నించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు నెల్లూరు వెళ్లారు.
ఇదిలావుంటే, దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల ఘటనలో ఎన్ఐఎ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌ల్లో ఎన్ఐఎ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఓ బృందం శనివారంనాడు బీహార్‌లోని దర్బంగాకు బయలుదేరింది. హైదరాబాద్ పేలుళ్లలో ఐదుగురు స్లీపర్ సెల్స్ పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో వివరాలు సేకరించడానికి వారు దర్భంగా వెళ్లినట్లు సమాచారం. అలాగే, తాజీర్ హసన్ కోసం వారు గాలిస్తున్నట్లు చెబుతున్నారు.
దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు ఘటనా స్థలానికి బెంగళూర్, గుజరాత్ ఎటిఎస్ బృందాలు చేరుకున్నాయి. సంఘటనా స్థలంలో ఆ బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి. ఇదిలావుంటే, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రేపు ఆదివారం హైదరాబాదు రానున్నారు. క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారు.












Click it and Unblock the Notifications