పేలుళ్లు: సైకిళ్లకు గుర్తింపు కార్డులు, రిజిస్ట్రేషన్ కూడా

New Rule: Identity needs to buy cycle
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల కొత్త ఎత్తుల నేపథ్యంలో సైకిళ్ల విషయంలో కొత్త నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఉగ్రవాదులు బాంబులను అమర్చి పేల్చేయడానికి సైకిళ్లను వాడుతుండడంతో ఈ కొత్త నిబంధనను అమలులోకి తేవాలని చూస్తున్నారు. సైకిలు ఉన్న ప్రతి ఒక్కరూ, కొత్తగా కొనాలని అనుకుంటున్నవారు గుర్తింపు, నివాస ధ్రువీకరణ కార్డులను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

మోటారు వాహనాల మాదిరిగానే సైకిల్‌కూ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నారు. రిజిస్ట్రేషన్ లేకపోతే కేసు నమోదు చేస్తారు. నాలుగేళ్ల క్రితం వరకూ పేలుళ్లకు స్కూటర్లను ఉపయోగించిన ఉగ్రవాదులు ఇప్పుడు సైకిళ్లను వాడుతున్నారు. వీటికి నెంబరున్నా రిజిస్ట్రేషన్ లేకపోవడమే కారణంగా చెబుతున్నారు.

హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్ వరుస బాంబు పేలుళ్లతో సహా అంతకు ముందు రాజస్థాన్, పుణెల్లో జరిగిన బాంబు దాడుల్లోను ఉగ్రవాదులు సైకిల్ బాంబులనే ఉపయోగించారు. దీంతో ఉగ్రవాదుల సైకిల్ వ్యూహానికి హోంశాఖ పరిష్కారాన్ని కనుక్కొంది. సాధారణంగా ప్రతి సైకిల్‌కు సీటు కింద రాడ్‌పై నెంబరుంటుంది. ఈ నెంబర్‌తో పాటు, సైకిల్ యజమానులు తమ గుర్తింపు వివరాలతో ఇకపై స్థానిక పోలీసు స్టేషన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే, సైకిల్ కొనుగోలు సమయంలోనే గుర్తింపు పత్రాన్ని దుకాణదారుడికి సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై హోంశాఖ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. పేలుళ్లలాంటి ఘటనల్లో సైకిళ్లను వినియోగిస్తే ఈ నెంబరు ఆధారంగా దర్యాప్తు జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+