తెలంగాణకే అప్కాబ్: పంతం నెగ్గించుకున్న డికె అరుణ

అదే సమయంలో డికె అరుణ తమ జిల్లాకు చెందిన వీరా రెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టారు. తెలంగాణ మంత్రుల పట్టు, డికె అరుణ పంతం నేపథ్యంలో పాలమూరుకు చెందిన వీరా రెడ్డికి చైర్మన్ పదవి దక్కింది. కరీంనగర్ జిల్లాకు చెందిన రవీందర్ రావుకు కూడా ఇవ్వాలని మంత్రులు కోరడంతో పదవిని రెండున్నరేళ్లుగా పంచారు. మొదటి రెండున్నరేళ్లు వీరా రెడ్డి, తర్వాత రెండున్నరేళ్లు రవీందర రావును ఎంపిక చేశారు.
దీనికి సంబంధించి మంత్రి పార్థసారథి మాట్లాడారు. వీరా రెడ్డి, రవీందర రావుల పేర్లను అందరూ ఆమోదించారని పార్థసారతి చెప్పారు. అందరితో చర్చించాకే ప్రకటించామన్నారు. మొదటి రోజు సమావేశంలో వైస్ చైర్మన్ ఎంపిక జరుగుతుందన్నారు. వీరా రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. మొదట కృష్ణా జిల్లాకు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
మా జిల్లా నేతకు అప్కాబ్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని డికె అరుణ చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చారని, పార్టీకి, రైతుల అభివృద్ధికి తాను పాటుపడుతానని వీరా రెడ్డి చెప్పారు. అన్నింటిని పరిగణలోకి తీసుకొని ఆచితూచి చైర్మన్ పదవిని నిర్ణయించారని అన్నారు.












Click it and Unblock the Notifications