వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం: 18 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Major fire breaks out in Kolkata market, 17 killed
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని సూర్జా సేన్ మార్కెట్‌లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు. ఐదు మృతదేహాలను వెలికి తీశారు. మంటలను నియంత్రించడానికి 25 ఫైర్ ఇంజన్లను రప్పించారు. ఊపిరాడకనే చాలా మంది మరణించినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గల కారణాలేమిటనేది తెలియరాలేదు. మార్కెట్‌లో అగ్నిని ఆకర్షించే కాగితాలు, ప్లాస్టిక్ వంటి సరుకులు పేరుకుపోయి ఉన్నాయి. అందరూ నిద్రిస్తున్న వేళ బుధవారం తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మృతదేహాలను ఎన్ఆర్ఎస్ ఆస్పత్రికి, వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

పలువురు గాయపడ్డారు. దాదాపు 30 మంది మంటల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మార్కెట్ భవనంలో సరైన అగ్ని నియంత్రణ యంత్రాలను ఏర్పాటు చేయాలనే తన విజ్ఞప్తిని కోల్‌కతా మున్సిపాలిటీ పట్టించుకోకపోవడం వల్లనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానిక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శిఖా మిత్రా విమర్శించారు.

కోల్‌కతా పోలీసు కమిషనర్ సురజతి కర్ పురకాయస్త సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో గత కొంత కాలంగా కోల్‌కతాలో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిరుడు మార్చిలో చారిత్రాత్మకమైన హతిబగన్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరణాలు సంభవించకపోవడం ఊరట కలిగించిన విషయం.

English summary
A massive fire broke out in Surja Sen market near Sealdah in Kolkata on Wednesday morning. Eighteen people were killed in the fire. Five bodies have so far been rescued. Twenty-five fire engines were sent to the spot to bring the fire under control. The deaths were mainly caused by suffocation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X