వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రదర్ అనిల్ సంగతేమిటి: అగస్టా స్కామ్‌పై టిడిపి ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Anil Kumar
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్ పాత్రపైనా విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడు టి. దేవేందర్‌గౌడ్, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ డిమాండ్ చేశారు. అగస్టా కుంభకోణంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వారు ప్రసంగించారు.

దేశంలో ఏ కుంభకోణం వెలుగుచూసినా దాని మూ లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నాయని సీఎం రమేశ్ విమర్శించారు. ఎమార్-ఎంజీఎఫ్ డైరెక్టర్ హష్కే ప్రారంభించిన ట్రస్టుకు వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 800 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించిందని, ఆ ట్రస్టుకు వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ట్రస్టీగా ఉన్నారని వెల్లడించారు.

దేశంలో అగస్టా హెలికాప్టర్‌ను ముందుగా కొనుగోలు చేసింది వైయస్ హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని, ఆ హెలికాప్టర్ ఈ మధ్యనే కాలిపోయిందని అంటూ ఈ వ్యవహారంపైనా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వైయస్ హయాంలోనే ఈ కుంభకోణానికి అంకురార్పణ జరిగిందని దేవేందర్‌గౌడ్ ఆరోపించారు. అప్పుడు సభలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు కెవిపి రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై విచారణను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

English summary
Telugudesam party MPs Devender Goud and CM Ramesh have questioned the role of YS Rajasekhar Reddy's son-in-law brother Anil kumar's role in VVIP chopper deal scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X