హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాజెక్టు ఆపడంలో అర్థంలేదు: బాబ్లీపై ఎపికి ఎదురుదెబ్బ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shock to AP on Babli Project
న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మన రాష్ట్రానికి ఎదురుదెబ్బ తగిలింది. బాబ్లీ ప్రాజెక్టు యథావిధిగా ఉంటుందని, దానిని తొలగించలేమని సుప్రీం కోర్టు గురువారం తేల్చిచెప్పింది. ప్రాజెక్టుపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర వాటా కింద నీటిని వాడుకునేందుకు పర్యవేక్షక కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. త్రిసభ్య కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్క ప్రతినిధి, చైర్మన్‌గా జలవనరుల సంఘం సభ్యుడి నియామకం జరుగనుంది.

ప్రాజెక్టు విషయంలో ఎపి వాదన కోర్టులో వీగిపోయింది. ప్రాజెక్టు నిర్మాణం ఆపమని చెప్పడంలో అర్థం లేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకునేందుకు మహారాష్ట్రకు సుప్రీం కోర్టు అనుమతిని ఇచ్చింది. ఏడేళ్ల సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. 2.47 టిఎంసిలకు మించి నీటిని మహారాష్ట్ర వాడుకునేందుకు అనుమతి లేదని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం 0.6 టిఎంసిల నీటిని విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది.

జూలై 3న సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. 2008 మార్చి 26న బాబ్లీ చట్టబద్దతపై పూర్తి స్థాయి విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 2012 నవంబర్ 8న బాబ్లీ పైన సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. మహారాష్ట్ర, ఎపిలు తమ తమ వాదనలు వినిపించాయి.

గతేడాది సెప్టెంబరులో బాబ్లీ ప్రాజెక్టు పూర్తయింది కదా ఇప్పుడేం చేద్దామని సుప్రీం కోర్టు ఆంధ్ర ప్రదేశ్‌ను ప్రశ్నించింది. దీనిపై అప్పు డే మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. మన రాష్ట్రం తరఫున పరాశరణ్, మహా తరఫున అర్జున్ అనే న్యాయవాదులు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.

English summary
supreme Court has asked Andhra Pradesh government wether it wants to lift the gates of Babli project, which was constructed on Godavari river. Supreme Court adjourned the hearing for september 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X