పడుకున్నోన్ని పడుకున్నట్లే అగాధం మింగేసింది

రాత్రి జెఫ్ తన పడకగదిలో పడుకుని ఉన్నాడని, ఒక్కసారిగా ఇంట్లోకి అదో కారు దూసుకుని వచ్చినట్లు శబ్దం వచ్చిందని, ఇంతలో జెఫ్ ఆర్తనాదాలు వినిపించాయని వారు చెప్పారు. అతడిని కాపాడేందుకు తాము ఎంతో ప్రయత్నించామని, కానీ ఏమీ చేయలేకపోయానని, అతను ఏమయ్యాడో అంతు చిక్కలేదని, పరుపు ఒక్కటే కనిపించిందని జెఫ్ సోదరుడు జెరెమీ బుష్ చెప్పాడు.
జెఫ్ పడుకున్న చోట దాదాపు వంద అడుగుల వ్యాసంలో ఓ అగాధం ఏర్పడింది. సహాయ బృందాలు వచ్చి అధునాతన పరికరాలతో జెఫ్ ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అతడి ఆనవాళ్లు కూడా లభించలేదు. సహాయక కార్యక్రమాలు సాగిస్తుండగా భవనం కింద నేల మరింతగా క్రుంగిపోవడం ప్రారంభించిందని చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో జెఫ్ కుటుంబ సభ్యులెవరికీ హాని కలగలేదు. ముందు జాగ్రత్తగా చుట్టు పక్కల ఇళ్లలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. భూమి పొరల్లో జరిగే మార్పుల కారమఁగా ఇలాంటి అగాధాలు హఠాత్తుగా ఏర్పడుతుంటాయని నిపుణులు అంటున్నారు. హారర్ మూవీలో లాగా సంఘటన చోటు చేసుకుంది.
బుష్ పడకతో పాటు డ్రెసర్, టీవి సెట్ కూడా అగాధంలో కూరుకుపోయాయి. టీవీ నుంచి వేలాడుతున్న కేబుల్ వైర్ మాత్రం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications