విశాఖ సముద్రంలో కూలిన నేవీ హెలికాప్టర్?

నలుగురు సిబ్బందిలో ఇద్దరి ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. హెలికాప్టర్ డాల్ఫిన్స్ నోస్‌కు పది నాటికల్ మైళ్ల దూరంలో కూలినట్లు తెలుస్తోంది. ఇది మంగళవారం మధ్యాహ్నం 2 రెండు గంటలకు తూర్పు నావికాదళ కేంద్రం నుంచి బయలుదేరిందని, సాయంత్రం 3 గంటల నుంచి దాని రాడార్ సంకేతాలు అందడం లేదని అంటున్నారు.
సమాచారం బయటకు రావడానికి కూడా చాలా సమయం పట్టింది. అధికారులు మిగతా ఇద్దరి కోసం తీవ్రంగా గాలించగా, ఒకరి మృతదేహం లభించినట్లు తెలుస్తోంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications