వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్నర్: అసెంబ్లీలో ఏడ్చేసిన ఒమర్ అబ్దుల్లా

By Pratap
|
Google Oneindia TeluguNews

Omar Abdullah
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంగళవారం శానససభలో ఏడ్చేశారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన సంఘటనలో ఓ వ్యక్తి మరణించడంపై ప్రతిపక్షాలు ఆయనను కార్నర్ చేశాయి. దీంతో ఆయన తట్టుకోలేక ఏడ్చేశారు. రాష్ట్రంలో మరణం జరిగిన ప్రతిసారీ ప్రతిపక్ష పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ పాలనాయంత్రాంగం తప్పు లేకున్నా తనను నిందిస్తోందని ఆయన అన్నారు.

బారాముల్లాలో నిరసనల సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సైనికాధికారులు తమ ఇళ్లను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన ప్రదర్శనకు దిగారు. సైనికులపైకి రాళ్లు రువ్వారు. దీంతో సైనికులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు.

సైన్యం అవసరం లేని చోట సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం అమలును ఉపసంహరించాలని అబ్దుల్లా చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల ఒత్తిడికి ఏడ్చేసిన ఒమర్ అబ్దుల్లా ఉద్వేగం నుంచి బయటపడడానికి చాలా సమయమే తీసుకున్నారు. భద్రతా బలగాలు అమాయకులను మట్టుపెడుతుండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవసరం లేని చోటి నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించే విషయంపై కేంద్రంతో తాను చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌గడ్‌లో దంతేవాడలో నక్సలైట్లు భారత వైమానిక దళ హెలికాప్టర్‌పై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ అక్కడ సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టాన్ని అమలు చేయనప్పుడు ఇక్కడ ఎందుకు చేయాలని అడిగారు. తాను రాజకీయాలు చేయడం లేదని, సమస్యను రాజకీయం చేయడం లేదని ఆయన చెప్పారు.

English summary
Jammu and Kashmir Chief Minister Omar Abdullah on Tuesday broke down in the state assembly after the Opposition cornered him over the killing of one person at Baramulla in north Kashmir earlier in the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X