హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉగ్రవాద ముప్పు: హైదరాబాద్‌కు తాజా హెచ్చరికలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Fresh Warnings to Hyderabad on terror threat
హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉగ్రవాదులు విధ్వంసక పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. బుధ, గురువారాలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరించింది. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

వచ్చే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఐబి సూచించింది. దీంతో హైదరాబాదులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. రోడ్లపై, లాడ్జీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు.

లుంబినీ పార్క్‌లో పోలీసులు తనిఖీలు జరిపారు. ఐమాక్స్ వద్ద ఆక్టోపస్ సోదాలు చేస్తోంది. వనస్థలిపురంలో పోలీసులు తనిఖీల్లో రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన విచారణ జరుపుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లతో భయభ్రాంతులకు గురైన హైదరాబాదీలు తాజా హెచ్చరికలతో వణికిపోతున్నారు. అప్పట్లో నిఘా హెచ్చరికలను పట్టించుకోలేదన్న ఆరోపణలు రావడంతో ఈసారి పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గత నెల జరిగిన బాంబు దాడి నేపథ్యంతో నగరమంతా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు తాజా హెచ్చరికలతో మరింత క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తున్నారు. ఇటు నగరవాసులు కూడా తమ బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని సూచిస్తున్నారు.

కాగా నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. బుధవారం ఉదయం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమృత రవి అనే యువకుడు మృతి చెందాడు. రవి కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం బేగంపేట వాసి. రవి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

English summary
Union government has issued fresh warning to Andhra Pradesh government about the fresh threat to Hyderabad from terrorists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X