ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలిక నేహా

గత అక్టోబర్‌లో ఒలీవియా మానింగ్ అనే బాలిక 162 ఐక్యూతో మేధావుల క్లబ్ మెన్సాలో చోటు సాధించింది. తాజాగా బ్రిటన్‌లో ఉంటున్న నేహారాము ఈ ఘనత సాధించింది. నేహా తల్లిదండ్రులు మునిరాజు, జయశ్రీ ఇద్దరూ కంటి వైద్యులే. యుకెలోని మెన్స్ నిర్వహించే ఐఐఐబి పరీక్షలో ఆమె ఈ స్కోరు సాధించింది. నేహా ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు కింగ్ స్టన్‌కు వలస వెళ్లారు.
నేహా సాధించిన విజయంతో ఆమె తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. నేహాను చూసి తాము గర్వపడుతున్నామని, ఈ సంతోషం మాటల్లో చెప్పలేమంటున్నారు. ఆమె మేధస్సును తల్లిదండ్రులు మొదట్లో గుర్తించలేదు. ఓ పరీక్షలో ఆమె 280కి 280 మార్కులు సాధించింది. అప్పటి నుండి తల్లిదండ్రులు ఆమె మేధస్సుపై దృష్టి సారించారు. హారీపోటర్ వీరాభిమాని అయిన నేహాకు ఈత కొట్టడం సరదా.
మెన్స్ పరీక్ష చాలా కష్టమని, అందులో అంత స్కోరు సాధిస్తానని తాను ఊహించలేదని, సోమవారం ఫలితాలు చూసి ఆశ్చర్యపోయానని, సంతోషంగా ఉందని నేహా రాము అన్నారు. కాగా, ఐన్ స్టీన్ తన జీవిత కాలంలో ఎప్పుడూ ఇలాంటి మేధో స్థాయి పరీక్షలు ఎదుర్కోలేదు. అయితే ఆయన మేధోస్థాయి 160 వరకు ఉంటుందనేది అంచనా మాత్రమే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications