వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెళ్లొచ్చు, సాక్ష్యులతో మాట్లాడొద్దు: సాయికి అనుమతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijay Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎ-2 నిందితుడు, జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డికి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పలు ఆలయాలను సందర్శించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టు అనుమతించింది. మార్చి 8 నుంచి 15 వరకు ఆయా దేవాలయాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు గురువారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. కోర్టుకు ఫోన్‌లో అందుబాటులో ఉండాలని, సాక్షులతో మాట్లాడరాదని షరతులు విధించింది.

రైతుల నుంచి చవకగా భూములు కొని వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్న ఎమ్మార్‌పై ఆదాయపన్ను శాఖ దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. గజం రూ.5 వేలకే అమ్మినట్లు లెక్కలు చూపి, అనధికారకంగా రూ. 50 వేల వరకు విక్రయించినట్లు 15 మందిపై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది.

ఇలా ఆర్జించిన అదనపు ఆదాయం వివరాలను తెలుసుకుని, సంబంధిత వ్యక్తుల నుండి పన్ను వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సిబిఐ సహకారం కోరింది. ఈ కేసులో ఇప్పటికే నాంపల్లి కోర్టులో సిబిఐ దాఖలు చేసిన మూడు చార్జిషీట్లు, వాంగ్మూలాలు, ఇతర పత్రాలు ఇవ్వాలని కోరుతూ ఐటి అధికారులు సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరుగనుంది.

బెంగళూరుకు గాలి

మరోవైపు ఓఎంసి కేసు నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డిని శుక్రవారం బెంగళూరు కోర్టులో హాజరు పర్చనున్నారు. గాలి బెయిల్ పిటిషన్ పైన సిబిఐ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. వాదులు పూర్తి కాకపోవడంత విచారణను శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది.

English summary

 The CBI court on Thursday granted permission to Vijay Sai Reddy, the second accused in the disproportionate assets case against YS Jaganmohan Reddy, to go on a pilgrimage from March 8 to 15. The court directed him to keep his cell phone switched on from 9 am to 9 pm so as to be available to CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X