జగన్ సలహాలు వద్దు, బయట పడేందుకు డ్రామా: గాలి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చేందుకే అవిశ్వాసం నాటకం ఆడుతున్నారని విమర్శించారు. దోపిడీలో జగన్ ఎ1 అయితే, బ్రదర్ అనిల్ ఎ2 ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.
శాసనసభలో అవిశ్వాసం తీర్మానం ఎవరు ప్రవేశపెట్టినా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో ఆ విధంగా అన్నారు. బలాబలాలను శాసనసభలో నిరూపించుకుంటామని చెప్పారు.
ఏప్రిల్ నెల ఆఖరున లేక మే మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్ సమస్యని, నీటి ఎద్దడిని అధిగమిస్తామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications