షర్మిలకు లక్ష్యం లేదు, బాబును నమ్మరు: తులసి రెడ్డి

Tulasi Reddy
విజయనగరం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు నాయకురాలు షర్మిల చేపట్టిన పాదయాత్రకు అర్థం లేదని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి చెప్పారు. శుక్రవారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో సమావేశం నిర్వహించారు.

తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించారని, ఏ పథకం అమలు చేయాలి? ఎలా చేయాలన్నది చంద్రబాబుకు పూర్తిగా తెలుసునన్నారు. ఇప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నారన్నారు. దీనికి ప్రజావిశ్వసనీయత లేదన్నారు. చంద్రబాబుని ప్రజలు నమ్మరని, ఆయన కాలం చెల్లిన మందులతో సమానమని ఆరోపించారు. ఆయన హామీలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు.

షర్మిల పాదయ్రాతలో ప్రతి చోటా తిరిగి రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తానని చెబుతున్నారని అయితే వైయస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లో వున్నప్పుడే ఆ పథకాలు అమలు జరిగాయన్నారు. చివరకు ఆయన పంచభూతాల్లో కలిసిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోనే వున్నారన్నారు. ఇప్పుడు వైయస్ ఆశయాలు, పథకాలే కొనసాగుతున్నాయని, కానీ అమె తిరిగి రాజన్నరాజ్యం తీసుకువస్తానని చెప్పడం హస్యాస్పదంగా ఉందని తులసి రెడ్డి అన్నారు. షర్మిల పాదయాత్రకు ఒక లక్ష్యం లేదని విమర్శించారు.

శాసన సభ సమావేశాల్లో ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమౌతున్నాయి కదా? అన్న ప్రశ్నకు కొత్తగా ఏర్పడిన పార్టీ ఒక విషయాన్ని తెరపైకి తెచ్చిందని తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెడితే, కుమ్మక్కు అవలేదంటారని పెట్టకపోతే, కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కయ్యారని ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. అవిశ్వాసం పెట్టినా 2014లో విజయం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+