వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మనీ స్త్రీపై రేప్ కేసులో దోషి: ఎట్టకేలకు బిట్టి ఆరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bitti Mohanty
తిరువనంతపురం: ఒడిషా మాజీ డిజిపి విద్యా భూషణ్ మొహంతి కుమారుడు బిట్టి మొహంతిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో జర్మన్ టూరిస్టుపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బిట్టికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అయితే, అతను పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అతన్ని కేరళలోని కన్నూరు జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు.

కన్నూరు ఎస్పీ రాహుల్ ఆర్ నాయర్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం శుక్రవారం రాత్రి కన్నూరు జిల్లాలోని పజాయంగడిలో బిట్టిని అరెస్టు చేశారు. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ బ్యాంకులో బిట్టి పనిచేస్తున్నాడనే సమాచారంతో పోలీసులు గాలించి పట్టుకున్నారు.

నకిలీ గుర్తింపుతో అతను ఏడాది కాలంగా బిట్టి రాఘవ్ రజన్ పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్‌లో పనిచేస్తున్నాడు. పెరోల్‌ను జంప్ చేయడానికి బిట్టికి తండ్రి విద్యా భూషణ్ మొహంతి సహకరించాడనే ఆరోపణలు ఉన్నాయి. తండ్రి హోదాను వాడుకుని బిట్టి 15 రోజుల పెరోల్ సంపాదించి, ఆ తర్వాత అదృశ్యమయ్యాడు.

బిట్టి అరెస్టును ధ్రువీకరించడానికి పోలీసులు మొదట ఇష్టపడలేదు. అరెస్టు అయింది అతనా, కాదా అనేది తేల్చుకోవాల్సి ఉందని, మరో వ్యక్తి పేరు మీద చెలామణి అవుతున్న కేసులో ఆ వ్యక్తిని అరెస్టు చేశామని, తాము అరెస్టు చేసిన వ్యక్తి బిట్టియా, కాదా అనేది రాజస్థాన్ పోలీసులు తేలుస్తారని, బ్యాంక్ అధికారుల ఫిర్యాదుపై తాము అతన్ని అరెస్టు చేశామని కన్నూరు ఎస్పీ రాహుల్ ఆర్ నాయర్ చెప్పారు.

English summary
A day after India observed International Women's Day, media reports suggest that rape convict Bitti Mohanty, who has been absconding has been arrested by Kerala police on Saturday, March 9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X