పాశ్చాత్య దృక్పథం వల్లే రేప్‌లు: బిజెపి నేత జోషీ

పాశ్చాత్య, భారత దృక్పథాలకు మధ్య తేడా ఉందని, మహిళను బలహీనులుగా వారు పరిగణిస్తారని, మనం తల్లిగా గౌరవిస్తామని ఆయన అన్నారు. డెంటెడ్ పెయింటెడ్ బియాండ్ ఫ్లెష్ అనే పుస్తకాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. మహిళలను బలహీనులుగా పరిగణించేవారు వారిపై అత్యాచారాలకు దిగుతారని, తల్లిగా మనం చూస్తాం కాబట్టి పూజిస్తామని ఆయన అన్నారు.
మహిళను భారతీయ దృక్పథం ఎప్పుడూ బలహీనులుగా చూపలేదని, మహిళ అబల అనేది భారత తాత్వికతకు సంబంధించిన ఆలోచనలకు విరుద్ధమని ఆయన అన్నారు. ఇందుకు ఉదాహరణగా ఆయన పలు ఉటంకింపులు ఇచ్చారు.
మహిళ కేవలం దేహం మాత్రమే కాదని, వ్యక్తిత్వం, బుద్ధి, మేధ అన్నింటికన్నా మించి విశ్వమాత అని ఆయన అన్నారు. మహిళ పట్ల పాశ్చాత్య దృక్పథమే మహిళలపై అత్యాచారాలకు కారణమని ఆయన ఆ విధంగా చెప్పారు.












Click it and Unblock the Notifications