అడగలేదని బిజెపి దూరం: బలం చూస్తారని జగన్ పార్టీ

 BJP may not participate in MLC elections
హైదరాబాద్: మరో పది రోజుల్లో జరుగనున్న ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికలకు దూరంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి స్వామి గౌడ్‌కు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మరికొంతమందికి మద్దతిచ్చింది. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం బిజెపి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా వివిధ పార్టీలను కోరిన టిడిపి ఒక్క బిజెపికి మాత్రం ఎలాంటి లేఖ రాయలేదు. తెరాస మద్దతు కోరినప్పటికీ సమాధానం ఇవ్వలేదట. తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుందట. ఒకవేళ తెరాసకు మద్దతు ఇచ్చినా ఆ పార్టీ గెలిచే పరిస్థితిలో ఉండకపోవచ్చని, అలాంటప్పుడు మద్దతివ్వకపోవడమే మంచిదనే ఆలోచనలో బిజెపి ఉందట. ఇక, టిడిపి తమకు ఎలాగూ లేఖ రాయలేదు కాబట్టి మద్దతివ్వడం అనవసరమని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

రెండో అభ్యర్థిపై జగన్ పార్టీ తర్జన భర్జన

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ నాటికి తమ పార్టీ బలం చూస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు శనివారం అన్నారు. ప్రస్తుతానికి ఒక్క స్థానానికి పోటీ చేస్తున్నామని, ఇతర పార్టీల విధానం చూశాక రెండో అభ్యర్థిని నిలబెట్టే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎ మ్మెల్సీ ఎన్నికల కోసం జగన్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన ఆదిరెడ్డి అప్పారావు శనివారం ఇక్కడ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అభ్యర్థిని గెలిపించుకునే ఎమ్మెల్యేల సంఖ్య పార్టీకి అధికారికంగా లేనప్పటికీ.. ఓటింగ్‌లో చూస్తారని, ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో అధికారికంగా చేరిన వారే చాలామంది ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచే ఒక్క స్థానాన్ని బిసి అయిన అప్పారావుకిచ్చామన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం బిసిలకు ఆనందం కలిగించిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే బిసిలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+