షబ్బీర్, పొంగులేటి..: కాంగ్రెసు ఎమ్మెల్సీ లిస్ట్ సిద్ధం, వీరే!

కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీల అభ్యర్థుల కోసం తీవ్ర కసరత్తు చేసింది. ఎమ్మెల్సీ రేసులో పై ఐదుగురితో పాటు కంతేటి సత్యనారాయణ, భారతి నాయక్, కమలాకర్ రావు, రజనీ రెడ్డి, కనుకుల జనార్ధన్, వాణీ రావు, కె.శ్రీ.న్యాగి, మాదాసు గంగాధరం తదితరులు ఉన్నారు. వీరిలో పై ఐదుగురిని అధిష్టానం ఎంపిక చేసింది. ఎంపికలో ప్రాంతాలు, సామాజిక, రాజకీయ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు.
పలువురు ఆశావహులు నేతలను కలుసుకొని అభ్యర్థిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను భారతి రాగ్యా నాయక్ ఈ రోజు కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఆమె చర్చించినట్లుగా తెలుస్తోంది. బొత్సతో భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ... ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై బొత్స తనకు ఏమీ చెప్పలేదన్నారు. బొత్స, మంత్రి సి.రామచంద్రయ్యలతో షబ్బీర్ అల భేటీ అయ్యారు.
పొంగులేటి సుధాకర్ రెడ్డిని తప్పించి పాత ముఖాలకు అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. పార్టీ పటిష్టత కోసం పని చేయక పోవడం, పార్టీలు మారి మళ్లీ రావడం వంటి అంశాలను అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఒక్కరే మళ్లీ అవకాశం దక్కించుకున్నారు. కాగా కంతేటి సత్యనారాయణ రాజుకు గవర్నర్ కోటాలో దక్కింది.
తెలంగాణకు అన్యాయం.. యాదవ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ముందుగానే అన్నారు. తెలంగాణవాదం వినిపించిన వారిని పక్కన పెడుతున్నారని ఆరోపించారు. అదే నిజమైతే కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకమన్న సంకేతాలు వస్తాయని, అది మంచిది కాదన్నారు.












Click it and Unblock the Notifications