గోదావరిలో ఐదుగురి గల్లంతు: ఉరేసుకున్న దంపతులు

Five students drowned in Godavari
కడప/ఖమ్మం: ఖమ్మం జిల్లాలో గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. జిల్లాలోని అశ్వాపురం చింతిర్యాలలో ఆదివారం ఉదయం గోదావరి నదిలో సరదాగా ఈత కొట్టేందుకు వారు వెళ్లారు.

వారు గల్లంతయినట్లుగా సమాచారం రావడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన వారిలో పదమూడేళ్ల సలీం, పద్దెనిమిదేళ్ల రావులపల్లి చంటి, ఏడేళ్ల తాజుద్దీన్, పదేళ్ల సూర్యతేజ, పన్నెండేళ్ల పవన్‌లు ఉన్నారు.

ఇందులో తాజుద్దీన్, సలీం, రావులపల్లి చంటిల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరు పవన్, సూర్యతేజల కోసం గాలిస్తున్నారు. గోదావరి నదిలో వీరు మునిగిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.

ఉరివేసుకున్న దంపతులు

కడప జిల్లాలో యువ దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని ప్రొద్దుటూరులోని సంజీవనగర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

గంజాయి పట్టివేత

విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న యాభై కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని చోడవరంలో ఇది జరిగింది. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు. రూ.2.5 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.

అక్కాతమ్ముడు మృతి

కృష్ణా జిల్లాలో గంపలగూడెంలో శివారు కక్కేరులో స్నానానికి వెళ్లిన అక్కా తమ్ముళ్లు నీటి గుండంలో పడి మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+