జగన్‌పై లోకేష్ పరోక్ష వ్యాఖ్య: వేరే ఉద్యోగమంటూ చలోక్తి

Nara Lokesh
చిత్తూరు: బీరు, బిర్యానీ పార్టీలకు జై కొడితే ఆ పార్టీ నాయకుడిలాగే జైలుకెళ్లక తప్పదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. బీరు, బిర్యానీలకు యువత మోసపోవద్దని కోరారు.

రాష్ట్రంలో అసమర్థ పార్టీ పాలన సాగిస్తోందన్నారు. నిజమైన రైతు బాంధవుడు చంద్రబాబు నాయుడేనని, అతను అధికారంలోకి వస్తే అన్నదాతల కోసం సోలార్ పవర్ పంపులు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బాబు పైన రైతు వ్యతిరేకి అనే తప్పుడు ముద్రను వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి, అసమర్థ పార్టీలు పాలిస్తే రాష్ట్రం అధోగతి కావడం ఖాయమన్నారు. పిల్లలు తల్లి కొంగు పట్టుకు తిరిగినట్లు, పిల్ల కాంగ్రెసు ఎప్పటికైనా తల్లి కాంగ్రెసులో కలిసిపోతుందన్నారు.

నేను వేరే ఉద్యోగం చూసుకోవాల్సిందే

నారా లోకేష్ శుక్రవారం చిత్తూరు జిల్లాలోని రాళ్లగంగమాంబ ఆలయ ఆవరణలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎవరెవరు ఏమేమి కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. 'డాక్టర్లు ఎవరవుతారు? ఇంజినీర్లు కావాలని ఎవరికి కోరిక ఉంది? పోలీసులు కాబోయేవారెవరు?' అని ప్రశ్నిస్తూ చేతులెత్తాల్సిందిగా చిన్నారులను కోరారు.

ఆ తర్వాత రాజకీయ నాయకులు ఎవరవుతారు? అని ప్రశ్నించారు. దానికి ఒకే విద్యార్థి చేతులెత్తాడు. దీంతో లోకేష్.. రాజకీయాల్లో అవినీతి, అసమర్థతనే ఇప్పుడు కనిపిస్తోందని, సమర్థనేత వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు. పై చదువులు చదివి రాజకీయ విధానాల్లో సరికొత్త విప్లవాత్మక మార్పులు తేవాల్సిన బాధ్యత విద్యార్థుల పైనే ఉందని చెప్పి మరోసారి రాజకీయాల్లోకి వచ్చే వారని చేతులెత్తమన్నారు. దాంతో అందరూ చేతులెత్తారు. దానికి లోకేష్.. అందరు రాజకీయాల్లోకి వస్తే ఇక నేనుండనని, మళ్లీ వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సిందేనని చమత్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+